ఒరిగిపోయిన విద్యుత్ పోల్... టాటా నగర్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

ఠాగూర్
బుధవారం, 19 నవంబరు 2025 (16:33 IST)
టాటా నగర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెనుప్రమాదం తప్పింది. విద్యుత్ స్తంభం ఒకటి పక్కకు ఒరిగిపోయింది. దీన్ని గమనించిన లోకో పైలెట్ రైలును ఆపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన విశాఖపట్టణం సమీపంలోని పెందుర్తి రైల్వే స్టేషన్‌కు సమీపంలో జరిగింది. 
 
ఈ రైల్వే స్టేషన్‌కు సమీపంలో విద్యుత్ లైన్ పనులు జరుగుతున్నాయి. అయితే, ఓ విద్యుత్ పోల్ పక్కను ఒరిగిపోయింది. అదేసమయంలో ఆ మార్గంలో టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌ వస్తోంది. లోకో పైలట్‌ అప్రమత్తమై రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. 
 
విద్యుత్‌ వైర్లపై స్తంభం పడటంతో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో దాదాపు గంట పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయమేర్పడింది. రైల్వే సాంకేతిక నిపుణులు ఆ మార్గంలో పునరుద్ధరణ పనులు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments