ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయలో ఒక షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. స్థానిక ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్‌లో ఒక వ్యక్తి నిద్రిస్తున్న రోగుల నుండి మొబైల్ ఫోన్‌లను దొంగిలిస్తున్నట్లు కనిపించిన ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో, వైద్య సౌకర్యాల లోపల భద్రత లేకపోవడంపై నెటిజన్లను ఆందోళనకు గురిచేసింది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఒక ఆసుపత్రిలో అర్ధరాత్రి సమయంలో ఈ సంఘటన జరిగింది. నల్లటి షర్ట్ తెల్లటి ప్యాంటు ధరించిన వ్యక్తి నిద్రపోతున్న రోగుల పడకల మధ్య నిశ్శబ్దంగా కదులుతూ ఫోన్లను దొంగలించినట్లు ఫుటేజ్‌లో ఉంది. చాలా మంది రోగులు మేల్కొని తమ ఫోన్లు కనిపించకుండా పోయాయని గమనించిన తర్వాత ఆసుపత్రి అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.
సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన సిబ్బంది, పోలీసులకు ఆ వీడియో ఫుటేజ్‌లను అందజేశారు. ఈ సంఘటన ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.