Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల - టాప్ ర్యాంకర్లు వీరే

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (15:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ‘ఏపీ ఈఏపీసెట్’ పరీక్షా ఫలితాలను ఆ రాష్ట్ర విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం విడుదల చేశారు. 
 
విజయవాడ ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలను విడుదల చేశారు. అలాగే, ఈనెల 14న వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల ఫలితాలు వెల్లడించనున్నారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 1,34,205 మంది అంటే 80.62శాతం ఉత్తీర్ణత సాధించారు. గురువారం నుంచి ర్యాంక్‌ కార్డుల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. 
 
మరోవైపు ఈ ఫలితాల్లో అనంతపురానికి చెందిన నిఖిల్‌ మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నారు. అలాగే, రెండో ర్యాంకును శ్రీకాకుళం వెంకట ఫణీష్‌, మూడో ర్యాంకు కడప దివాకర్‌ సాయి, నాలుగో ర్యాంకు విజయనగరం మౌర్యా రెడ్డికి, ఐదో ర్యాంకు నెల్లూరు శశాంక్‌రెడ్డికి, ఆరో ర్యాంకు ప్రకాశం ప్రణయ్‌, ఏడో ర్యాంకు విజయనగరం హర్ష, వర్మ ఎనిమిదో ర్యాంకు విజయవాడ కార్తికేయ, తొమ్మిదో ర్యాంకు పశ్చిమగోదావరి ఓరుగంటి నివాస్‌, పదో ర్యాంకు చిత్తూరు జిల్లాకు చెందిన విద్యార్థి కైవసం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments