Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో నేడు EAMCET ఫలితాలు - 18 నుంచి ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌

Advertiesment
ఏపీలో నేడు EAMCET ఫలితాలు - 18 నుంచి ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌
, బుధవారం, 8 సెప్టెంబరు 2021 (09:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన EAMCET ఫలితాలు బుధవారం వెల్లడికానున్నాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రకటించనున్నారు. ఈ పరీక్షకు మొత్తం 1,66,460 మంది విద్యార్థులు హాజరయ్యారు. 
 
ఆ తర్వాత కళాశాలల్లో ప్రవేశాల కోసం మొదటి విడత కౌన్సెలింగ్‌ ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహించే అవకాశాలున్నాయి. ఇదిలావుంటే, ఇంటర్మీడియెట్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్లను హైకోర్టు కొట్టివేయడంపై మంత్రి సురేశ్‌ స్పందించారు. పూర్తి పారదర్శకత కోసమే ఆన్‌లైన్‌ విధానం అనుకున్నామన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10 గ్రాముల బంగారంపై రూ.110 తగ్గుదల