Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల వెల్లడి

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల వెల్లడి
, బుధవారం, 25 ఆగస్టు 2021 (11:49 IST)
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం ఉదయం ఎంసెట్ ఫలితాలను వెల్లడించారు. కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఎంసెట్‌ 2021ని ఆ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ఎట్టకేలకు సజావుగా నిర్వహించి ఫలితాలు కూడా విడుదల చేసింది. దీంతో విద్యార్థులు ఫలితాలను తెలుసునేందుకు ఆసక్తి చూపుతున్నారు. 
 
కాగా, ఈ ఎంసెట్ ఫలితాలను హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈనెల 30 నుంచి రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ప్రారంభంకానుంది. ఈ ఏడాది జరిగిన ఎంసెట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌ పరీక్షకు 90 శాతం మంది హాజరుకాగా… అగ్రికల్చర్‌, మెడికల్‌ ఎంట్రన్స్‌కు 91.19 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.
 
కరోనా రెండో దశ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది కరోనా కారణంగా ఇంటర్‌ పరీక్షలను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ ప్రక్రియలో ఇంటర్‌ వెయిటేజ్‌ను ఎత్తివేస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇంటర్‌లో వచ్చిన మార్కుల వెయిటేజ్‌ను తీసుకునే వారు. కానీ కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేయడంతో ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. 
 
ఎంసెట్ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్‌ మార్కుల వెయిటేజ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఇంటర్‌లో 45 శాతం మార్కులు ఉంటేనే ఇంజనీరింగ్ సీటు పొందే అవకాశం ఉండేది. కానీ పరీక్షలు రద్దు కావడంతో ఇప్పుడు ఎంసెట్‌లో అర్హత సాధించిన వారందరూ కౌన్సెలింగ్‌కు అర్హులేనని అధికారులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ‌ద్యంనే కాదు... నిన్ను కూడా తాక‌ట్టు పెట్టేస్తారు!!