Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్ధానం తర్వాత కనిగిరిలోనే ఆ సమస్య ఎక్కువ... ఎమ్మెల్యే కదిరి బాబురావు

అమరావతి: శాసనసభలో కిడ్నీ బాధితులపై చర్చ జరిగినట్లు కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద సోమవారం ఉదయం ఆయన మాట్లాడారు. ఉద్ధానం తరువాత కనిగిరి ప్రాంతంలోనే కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. నీటిలో ఫ

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (18:21 IST)
అమరావతి: శాసనసభలో కిడ్నీ బాధితులపై చర్చ జరిగినట్లు కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద సోమవారం ఉదయం ఆయన మాట్లాడారు. ఉద్ధానం తరువాత కనిగిరి ప్రాంతంలోనే కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కవగా ఉన్నందునే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.  2015 జూన్ నుంచి 2017 జూలై వరకు ప్రకాశం జిల్లాలో 345 మంది కిడ్నీ బాధితులు చనిపోయినట్లు చెప్పారు.
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ప్రకాశం జిల్లాలో చీరాల, కందుకూరు, మార్కాపురం, కనిగిరి మొత్తం 5 చోట్ల డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ నియోజకవర్గంలోని డయాలసిస్ సెంటర్లో షిప్టుల పద్ధతిపైన రోజుకు 30 మందికి టెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. కిడ్నీ బాధితులకు వైద్యం అందజేయడానికి ప్రభుత్వం రూ.5 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు, అలాగే వారికి నెలకు రూ.2500ల పెన్షన్ అందజేస్తున్నట్లు వివరించారు. 
 
ప్రైవేటు ఆస్పతులలో టెస్ట్ చేయించుకున్నవారికి కూడా పెన్షన్ ఇవ్వాలని కోరామని, అందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఫ్లోరైడ్ రహిత నీటిని సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో కొన్ని ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశారని, మరో ఏడాదిలో అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారని ఎమ్మెల్యే బాబురావు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments