రాత్రిపూట పడక గదిలో మొబైల్ ఫోన్స్... ఇవి డేంజర్...
చాలామంది మాటిమాటికీ ఫోన్ చూసుకోవడం, నలుగురి మధ్యలో వున్నా అదే ధ్యాసలో వుండిపోవడం గమనిస్తుంటాం. దీనివల్ల ఎంత సమయం వృధా అయిందన్నది పట్టించుకోరు. ఫోన్లు అతిగా వాడేవారు దీన్నుంచి బయటపడాలి. అందుకోసం కొన్ని నియమాలు పాటించాలి.
చాలామంది మాటిమాటికీ ఫోన్ చూసుకోవడం, నలుగురి మధ్యలో వున్నా అదే ధ్యాసలో వుండిపోవడం గమనిస్తుంటాం. దీనివల్ల ఎంత సమయం వృధా అయిందన్నది పట్టించుకోరు. ఫోన్లు అతిగా వాడేవారు దీన్నుంచి బయటపడాలి. అందుకోసం కొన్ని నియమాలు పాటించాలి.
ఫోన్ మోగకపోయినా కొందరు దాన్ని పదేపదే చూస్తుంటారు. మెసేజ్ రాకపోయినా వచ్చిందేమోనని దాన్ని తీసి చూస్తుంటారు. అలాంటివారు ప్రతి అర్థగంటకో గంటకో ఫోన్ చూడాలన్న నియమం విధించుకోవాలి.
ఫోనులో అలారం పెట్టుకోవడం మరికొందరికి అలవాటు. దాంతో దాన్ని పక్కనే పెట్టుకుని పడుకుంటారు. అలా అలారం ఫిక్స్ చేసినప్పటికీ కొందరు అదే ధ్యాసలో పడుకుని కలత నిద్ర పోతుంటారు. అందుకే అసలు ఆ ఫోనును పడక గదికి దూరంగా పెట్టేయాలి.
ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ తదితర మాధ్యమాల్లో ఖాతాలు తెరిచిన వారు పొద్దస్తమానం ఫోన్ చేతిలో పెట్టుకుని వాటినే చూస్తూ కాలం గడిపేస్తారు. ఇది కూడా పొరబాటు. దానికి కూడా ఓ నిర్ణీత సమయాన్ని కేటాయించుకోవాలి.
ఇక ఈ మొబైల్ ఫోన్ వాడకం గురించి ధూమపాన వ్యసనం కంటే ఎక్కువగా మొబైల్ వాడకం మనుషులను చంపబోతున్నదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ ఫోన్లకు బ్రెస్ట్ క్యాన్సర్‌తో ఉన్న అవినాభావ సంబంధం కారణంగా భవిష్యత్తులో మానవ హననానికి మొబైల్ ఫోన్లు పునాది కానున్నాయని అంటున్నారు.
మితిమీరిన మొబైల్ వాడకం వల్ల మానవజాతి ఆరోగ్యంపై ధూమపానం కంటే, లంగ్ క్యాన్సర్ కంటే మించిన దుష్ప్రభావాలు కలుగనున్నాయని హెచ్చరించారు. మొబైల్ ఫోన్లకు ప్రాణాంతకమైన బ్రెయిన్ ట్యూమర్ - మెదడు కణితికు ఉన్న సంబంధం గురించి సంక్లిష్ట సమీక్షను నిర్వహించారు. ఈ పరిశోధనలో, మొబైల్ ఫోన్లను 10 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉపయోగించినట్లయితే బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం రెట్టింపు కానుందని కనుగొన్నారు.
మొబైల్ హ్యాండ్‌సెట్ల నుంచి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్‌కి మనుషులు అనివార్యంగా గురి కావల్సిన పరిస్థితులను తగ్గించేందుకు ప్రభుత్వాలు, మొబైల్ తయారీ పరిశ్రమలు నిర్ణయాత్మకమైన చర్యలను తక్షణమే ప్రారంభించాలని సూచించారు. అలాగే 10-15 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా మొబైల్ వాడుతున్న వినియోగదారులపై వెంటనే శాస్త్రీయ అధ్యయనాలను ప్రారంభించాలని కోరారు.
చరిత్రలో ధూమపానం, రాతినార ధూళి -ఆస్బెస్టాస్- మనుషుల ఆరోగ్యానికి కలిగించిన హాని కంటే మించిన ప్రమాదాలకు మొబైల్ వాడకం కారణమవుతోందని అంటున్నారు. ప్రత్యేకించి మొబైల్ మోజులో పడిపోయిన యువతరం, చిన్నారుల భవిష్యత్తు తలచుకుంటే ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగని ధూమపానం మంచిదని అర్థం కాదని, మొబైల్ ఫోన్ సంబంధిత సమస్యలు ధూమపానం కంటే ఎక్కువగా మానవ ఆరోగ్యాన్ని దెబ్బతీయనున్నాయని తెలిపారు. ప్రస్తుతం మొబైల్ వినియోగదారులు, ప్రతిరోజు, ప్రతిగంటా వీరి సంఖ్య పెరిగిపోతోందని ఖురానా చెప్పారు.
దారుణమైన విషయం ఏమంటే మూడేళ్ల ప్రాయంనుంచే పిల్లలు మొబైల్ వాడకం మొదలెట్టేస్తున్నారని చెప్పారు. మొబైల్ ఫోన్ నుంచి వెలువడే రేడియో ధార్మికశక్తి తలకు ఇరుభాగాలా వేడి కలిగించడమే కాక, మెదడుపై థర్మోఎలక్ట్రిక్ దుష్ప్రభావాలకు దారితీస్తుందని తీవ్రంగా హెచ్చరించారు.
తాజాగా వస్తున్న బ్లూటూత్ పరికరాలు, మూత లేని హెడ్‌సెట్లు వంటివి వినియోగదారుల తలను స్వీయ ప్రమాదకర యాంటెన్నాగా మార్చనున్నాయని చెప్పారు. అధికంగా మొబైల్ ఫోన్లను వాడుతున్నవారికి, అందులోను కాల్స్ చేయడానికి వినియోగదారులు వాడుతున్న చెవి పక్క మెదడులో కణుతులు పెరుగుతున్నట్లుగా వార్తలు ఎక్కువవుతున్నాయని తెలిపారు. కనుక ఇయర్ ఫోన్స్ లేకుండా మొబైల్ ఫోన్లలో మాట్లాడటం కూడదు. కనుక ఎల్లప్పుడూ ఇయర్ ఫోన్స్ దగ్గరే ఉంచుకునేందుకు యత్నించాలి.