Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాగ్రత్త... ఎత్తును మించిన బరువు... తగ్గకుంటే...

ఆహారపు అలవాట్లలో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీని కారణంగా మన శరీరంలో కొవ్వు పెరిగిపోయి అది ఊబకాయత్వానికి దారి తీస్తుంది. అయితే అధిక బరువు బారిన పడకుండా ఉండాలంటే కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలని అంటున్నారు పౌష్టికాహార నిపుణులు.

జాగ్రత్త... ఎత్తును మించిన బరువు... తగ్గకుంటే...
, బుధవారం, 12 జులై 2017 (21:48 IST)
ఆహారపు అలవాట్లలో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీని కారణంగా మన శరీరంలో కొవ్వు పెరిగిపోయి అది ఊబకాయత్వానికి దారి తీస్తుంది. అయితే అధిక బరువు బారిన పడకుండా ఉండాలంటే కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలని అంటున్నారు పౌష్టికాహార నిపుణులు. 
 
ఆహారపు అలవాట్లను సరైన పద్ధతిలో మలుచుకుంటే ఈ సమస్య దరిచేరదు. ముందుగా సోమవారం నుంచి శుక్రవారం వరకు వారంరోజుల పాటు ప్రతిరోజు తీసుకునే ఆహారం గురించి ఒక ప్రణాళిక తయారుచేయండి. ఈ విధంగా ప్రణాళిక వేసుకోవడం వల్ల మీరు తీసుకునే ఆహారంలో కంట్రోల్ ఉంటుంది. 
 
ఆదివారం రెండు పూటల భోజనం ఉండేటట్లు చూసుకోవాలి. ఒక పూట మీకు నచ్చిన ఆహారం తీసుకోండి. ప్రతి రోజు వ్యాయామం చేయండి. కుదరకపోతే వారంలో కనీసం మూడు రోజులైనా వ్యాయామం చేయడం మంచిది. సోమ, మంగళ, బుధ వారాలైయితే మంచిది. ఎందుకంటే వారం చివరిలో మీరు బిజీగా ఉండొచ్చు కాబట్టి ఈ మూడు రోజులు మీరు వ్యాయామం చేస్తే మరుసటి మూడు రోజులు ఉత్సాహంగా ఉండగలరు. 
 
ఉద్యోగరీత్యా మీరు గంటల తరబడి కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి మధ్యాహ్నం భోజనం తరువాత ఒక అరగంట సమయం నడవడం మంచిది. ఒక రోజులో ఒక కప్పు టీ త్రాగవచ్చు. మీరు అల్పాహారాన్ని ఉదయం 8 గంటల ముందు తీసుకోవాలి. ఈ భోజనం కూరగాయలతో ఉంటే ఇంకా మంచిది. తక్కువ క్యాలరీలు గల ఆహారం తీసుకోవాలి. 
 
వారంలో కనీసం నాలుగు రోజులైనా మీ ఇంటి నుండి భోజనం తీసుకొని రండి. దీనివల్ల బయట తిండి తగ్గుంది. ప్రోటీన్లు, కార్బోహైడ్రెట్లు సంమృద్ధిగా ఉన్న కూరగాయలును వాడండి. రాత్రి పూట వేగంగా నిద్రపోయి, ప్రోద్దునే మేల్కొండి. అప్పుడు మీరు పనిలో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. లేదంటే నిద్ర సరిపడక మీరు పని చేస్తున్నప్పుడు సమస్యలు వస్తాయి.
   
ప్రతిరోజు మూడు పూటల ఆహారం తీసుకోవడం మంచిది. అల్పాహారం ఉదయం 8 గంటలకు, మధ్యాహ్న భోజనం 1 గంటకు, రాత్రి భోజనం 7 గంటలకు తినడం ఉత్తమమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధమైనటువంటి ఆహారపు అలవాట్లు పాటించడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తోటకూరను వేళ్ళతో తీసుకుని దంచి తింటే...?