Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీజీపీ తక్షణమే జగన్ కి నోటీసులు ఇవ్వాలి: వర్ల రామయ్య

Webdunia
బుధవారం, 13 జనవరి 2021 (09:52 IST)
జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయి, ప్రభుత్వాధినేతననే ఆలోచనల నుంచి వైదొలుగుతూ, రాజకీయ నేత మాదిరే వ్యవహరిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి , పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు.

ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.  ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..!
నెల్లూరులో అమ్మఒడి కార్యక్రమంసభలో ముఖ్యమంత్రి ఫక్తు రాజకీయ నాయకుడి మాదిరే మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలకు సమాధానం చెప్పలేకే, ఆయన ఆసభలో రాజకీయాలు ప్రస్తావించారని అర్థమవుతోంది. సాక్ష్యాలు,ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవ్యక్తి, మాట్లాడటం సరికాదు.
 
ఆలయాలు పడగొట్టేవారే, తిరిగి వాటిసందర్శనకు వెళ్తూ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆసభలో అన్నారు. ఆయనవ్యాఖ్యలను బట్టిచూస్తే, ఆలయాలపై దాడులు చేస్తున్నవారిగురించి ముఖ్యమంత్రికి బాగాతెలిసినట్టు అర్థమవు తోంది. ముఖ్యమంత్రికి తెలిసినవారే, ఆలయాల సందర్శనకు వెళుతున్నారని, అటువంటి వారే రథయాత్రలు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి మాటల్లోనే అర్థమవుతోంది.

దేవాలయాలు పడగొట్టేవారు, విగ్రహాలుధ్వంసం చేసేవారు, రథాలు తగలబెట్టేవారు తనకు తెలుసునని జగన్ ఎప్పుడైతే చెప్పాడో, వెంటనే డీజీపీ రంగంలోకి దిగాలి. 91 సీఆర్ పీసీ చట్టంప్రకారం ముఖ్యమంత్రికి డీజీపీ తక్షణమే నోటీసులు ఇవ్వాలి. అమ్మఒడి సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఎవరైతే దేవాలయాలపై దాడులు చేస్తున్నారో, వారే తిరిగి వాటిని సందర్శిస్తున్నారని, ఎవరైతే రథాలనుతగలబెడుతున్నారో వారేరథయాత్రలు చేస్తున్నారని అన్నారుకాబట్టి, వారి గురించి మీకుతెలుసుకాబట్టి, ఆ సమాచారం మొత్తం సిట్ బృందానికి తెలియచేయాలని కోరుతూ డీజీపీ వెంటనే ముఖ్యమంత్రికి నోటీసులు అందచేయాలి.

నిజంగా డీజీపీకి ఆలయాలపై జరిగేదాడులవెనకున్న సూత్రధారులుఎవరో తెలుసుకోవాలంటే, ముఖ్యమంత్రి దగ్గరున్నసమాచారం తమకు ఇవ్వాలని కోరుతూ, సవాంగ్ ఆయనకు నోటీసులు అందచేయాలి. ముఖ్యమంత్రి దోషుల గురించి చెబితే, డీజీపీ గారి పనికూడా తేలిక అవుతుందని చెబుతున్నాం. గతంలో ప్రతిపక్షనేత చంద్రబాబుకు, నాకు, ఇతరటీడీపీనేతలకు నోటీసులిచ్చిన డీజీపీ, ముఖ్యమంత్రికి కూడా అదేవిధంగా నోటీసిచ్చి, ఆయననుంచి సమాచారం రాబట్టాలని డిమాండ్ చేస్తున్నాం.

అన్నీ తనకు తెలుసునంటూ మాట్లాడటంద్వారా ముఖ్యమంత్రి మతాల మధ్యచిచ్చుపెట్టేలా  వ్యవహరిస్తున్నాడని అర్థమైంది. డీజీపీ, ముఖ్యమంత్రికి నోటీసులివ్వకుంటే, దేవాలయాలపై జరుగు తున్న దాడులవిచారణ సక్రమంగా చేయడంలేదనే భావించాల్సి ఉంటుంది. అసలు దోషులను పట్టుకోవడంలో డీజీపీకి శ్రధ్ధలేదనే అనుకోవాల్సి ఉంటుంది. 
రాష్ట్ర ఎన్నికలకమిషనర్ ను ఉద్దేశించి, ఆయన చంద్రబాబుకి కోవర్టు అనడంద్వారా, జగన్మోహన్ రెడ్డి ఒకవ్యవస్థనే కించపరిచాడు.

జగన్ కు ఎవరైనా నచ్చకపోతే వారికి కులాలు, మతాలు ఆపా దించడంతో పాటు, వారు ఫలానావారికి కోవర్టు, తొత్తు అని నోటికొ చ్చినట్లు మాట్లాడతాడని అర్థమవుతోంది. ఎన్నికల కమిషనర్ ఒక వ్యవస్థకు ప్రతినిధి, అటువంటి వ్యక్తినికోవర్టు అంటారా? ముఖ్యమంత్రిగాతాను తొందరపడి, ఆయన్ని కోవర్టు అని నోరు జారానని ఒప్పుకొని జగన్మోహన్ రెడ్డి తక్షణమే ఎస్ఈసీకి క్షమాప ణ చెప్పాలి. తన వ్యాఖ్యలతో ఆయన ముఖ్యమంత్రి పదవికి అనర్హు డని తేలిపోయింది.

తన పదవిని జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసం, రాజకీయాల కోసమే వాడుకుంటున్నాడు తప్ప, ప్రజాపరిపాలనకు, రాజ్యాంగబద్ధ నిర్ణయాలకు వినియోగించ డం లేదు. ఎస్ఈసీని కోవర్టు అనడం పచ్చిబూతు. ముఖ్యమంత్రి గా తన బాధ్యతల నిర్వహణలో ఆయన తడబడుతూ, తప్పటడు గులు వేస్తున్నారని రుజువైంది. తనబాధ్యతల నిర్వహణలో ఆయన ఘోరంగా  విఫలమవుతున్నారు కాబట్టే, వ్యక్తులను ఉద్దేశించి, ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. 

చంద్రబాబునాయుడిపై క్రైస్తవ సంఘాలను రెచ్చగొట్టాలని చూడటం ఏమిటి? జగన్, ఆయన బావ, ఆయన కుటుంబం వారి రాజకీయ లబ్ధికోసం క్రైస్తవ మతాన్ని రెచ్చగొడుతూ, పవిత్రమైన మతాన్ని రోడ్డునపడేసింది మీరుకాదా?

జగన్మోహన్ రెడ్డి క్రైస్తవమతాన్ని తన స్వార్థంకోసం, తనరాజకీయాలకోసం వాడుకుంటున్నారన్న చంద్రబాబు నాయుడి వ్యాఖ్యల్లో తప్పేముందని నేను ప్రశ్నిస్తు న్నాను. ఆయన వ్యాఖ్యలు వాస్తవాలని నిరూపించడానికి కూడా తాను సిద్ధమే. క్రైస్తవ మతపెద్దలు జగన్మోహన్ రెడ్డిమాయాలో పడి, మోసపోవద్దని విజ్ఞప్తిచేస్తున్నాను.

జగన్మోహన్ రెడ్డి దేవుడు పంపి న బిడ్డ కాదు, ఆయన కేవలం విజయమ్మ, రాజశేఖర్ రెడ్డిల కొడు కు మాత్రమేనని క్రైస్తవమతపెద్దలు గ్రహించాలి. జగన్, ఆయన తల్లి, క్రైస్తవమతాన్ని రోడ్డునపడేశారనే నిజాన్ని అందరూ గ్రహించాలన్నా రు. తన రాజకీయఅవసరాలకు క్రైస్తవమతం అండగాఉండేలా జగన్ కావాలనే శాంతిని కాంక్షించే మతాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని విన్నవించుకుంటున్నాను. 

తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి గూడెంలో  చర్చిపై దాడిజరిగితే, అక్కడకు స్వయంగావెళ్లి, దాడికిపాల్పడినవారిని అరెస్ట్ చేయించి, చర్చికి జరిగిన నష్టాన్నిభర్తీచేసి, అక్కడ ప్రార్థనలు చేయించాకే తిరిగి వచ్చానని చంద్రబాబు చెప్పారు.
 
రాష్ట్ర ముఖ్యమంత్రి క్రైస్తవుడే, అందులో ఎలాంటిసందేహం లేదని చంద్రబాబుకూడా ఒప్పుకున్నారు.  అటువంటి వ్యక్తి హాయాంలో హైందవ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే, ఆయనింకా వేగంగా స్పందించాలి , దోషులను తక్షణమే పట్టుకొని శిక్షించి, అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

క్రైస్తవులు కానివారికి రూ.5వేలు ఇస్తూ, వారిని ఓటుబ్యాంకు రాజకీయాలకు వినియోగించుకోవాలని  ముఖ్యమంత్రి చూస్తున్నారని చంద్రబాబు చెప్పారు. దానిలో తప్పే మిటో క్రైస్తవమతపెద్దలు ఆలోచన చేయాలి. క్రైస్తవ పాస్టర్లకు చెందాల్సిన రూ.5వేలభృతి ఎవరికిపడితే వారికివ్వడం తప్పు అని మాత్రమే చంద్రబాబు అన్నారు. హైందవమతంపై దాడిచేసేవారిని పట్టుకోలేకపోయిన ముఖ్యమంత్రి , ఇప్పుడు వారు ఎవరో తనకు తెలుసునని ఎలా చెబుతాడు?

వారిని పట్టుకొని శిక్షించడంలో ఆయన ఎందుకు వెనకడుగు వేస్తున్నాడో అందరూ ఆలోచనచేయా లి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మతసామరస్యానికి మారుపేరుగా నిలిచే రాష్ట్రం. అటువంటి రాష్ట్రంలో ఈ విధంగా మతాల మధ్యచిచ్చు పెట్టే ఘటనలు జరగడమేంటి? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవ్యక్తి, వ్యక్తులపైకి మతాలను రెచ్చగొట్టడమేంటి?

డీజీపీ తక్షణమే 91సీఆర్ పీసీ చట్టంకింద ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వాలి. ముఖ్యమంత్రి కూడావెంటనే స్పందించి తనదగ్గరున్న సమాచారా న్ని సిట్ కు అందచేయాలి. దేవాలయాలను ధ్వంసంచేస్తున్న దెవరో, రథాలను తగలబెడుతున్నది ఎవరో ఆయన సిట్ వారికి తెలియచేయాలని ముఖ్యమంత్రిని  కోరుతున్నాను. నిమ్మగడ్డను కోవర్టు అన్నందుకు జగన్ ఆయనకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments