Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్మోహన్ రెడ్డి గారు.. మీది ఏమి పాదమో ?... మాజీ మంత్రి దేవినేని

Advertiesment
జగన్మోహన్ రెడ్డి గారు.. మీది ఏమి పాదమో ?... మాజీ మంత్రి దేవినేని
, శుక్రవారం, 8 జనవరి 2021 (20:17 IST)
వరుస తుఫాన్లు వరదలతో పంటలకు తెగుళ్లు సోకి దిగుబడులు తగ్గడం, పంట సాగు పెట్టుబడులు పెరగటం, పైపంటలకు ఇన్ పుట్ సబ్సీడీ అందకపోవటం వెరశి రైతులు పూర్తిగా కుదేలయ్యారని రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితితులు మునుపెన్నడూలేవని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది ఏమి పాదమో కానీ ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులను రైతులు ఎదుర్కొనడం దురదుష్టకరమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.

శుక్రవారం నాడు వీరులపాడు మండలంలోని చెన్నారావుపాలెంలో గ్రామ పర్యటనలో మొక్కజొన్న కల్లాలను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రైతులతో కలసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
 
"మొక్కజొన్న రైతులు ఎకరానికి 40 వేలు పెట్టుబడులు పెట్టారు ముప్పై నుంచి నలభై క్వింటాళ్లు అయ్యేది కనీసం 15 క్వింటాల్  కూడా అవ్వలేదు కొనే పరిస్థితి లేదు. కొన్నవాటికి కూడా ఇంత వరకు డబ్బులు ఇవ్వలేదు.
 
రైతులను నీది ఏ కులం ఏ మతం అని అడిగి అడుగుతున్నారు. ఇంతకు ముందు ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. రాజకీయ నాయకులు ఇంటికి వెళ్తే స్లిప్లు ఇస్తారంటా ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు ఎన్నడూ లేదు.
 
నీ రైతు బోరోసా కేంద్రాలు అంత బోగస్  ఈక్రాప్ విధానం అంత బోగస్ కౌలు రైతులను గాలికొదిలేశారు 15 లక్షలు కౌలు రైతులు ఉంటే మీ లెక్కలు లక్ష కూడా లేదుగతంలో 13 లక్షల మంది కౌలు రైతులకు డబ్బులు ఇచ్చాము.
 
పత్తి మూడు నాలుగు క్వింటాలు కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు 5వేలు రావాల్సిన పత్తి ని 3 వేలు, 4 వేలకు దళారులు  దోచుకుంటున్నారు రైతులకు ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎప్పుడూ రాలేదు.
 
జగన్మోహన్ రెడ్డి మిర్చి పెట్టుబడి ఎకరానికి లక్ష రూపాయల అవుతుంది ఒకొక్క మొక్క మూడు నాలుగు రూపాయల ఖర్చు అవుతుంది మినుము, పత్తి, పెసలు అన్ని పంటలు పోయాయి.
 
సుబాబులు పక్క రాష్ట్రంలో 3 వేలు అమ్ముతుంది ఇక్కడ 12 వందలు కూడా కొనే దిక్కు లేదు శాసన సభలో ఉత్తరకుమారుడు ప్రగల్భాలు పలికారు. సుబాబు రైతులను ఉద్దరిస్తామని చెప్పి  రైతు ను పూర్తిగా నరికేశారు.
 
పంపు సెట్టుకు మీటర్లు పెట్టి రైతు మేడకు ఉరి వేస్తారా ? గ్రామంలో రైతులు క్షేమంగా ఉంటేనే గ్రామం బాగుంటుంది రైతు కళ్లలో కన్నీరుకు బదులు రక్తం వస్తుంది క్షేత్ర స్థాయిలో పరిశీలించే తీరిక మీకు లేదు"  అని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : మండలి బుద్ధప్రసాద్