Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయిన నెలకే కాటేసిన కరోనా.. తెలుగు జర్నలిస్టు మృతి

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (12:59 IST)
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ప్రతి రోజూ వేలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ సోకి ఓ జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయారు. 
 
జీ సంస్థలో వీడియో ఎడిటర్‌గా పనిచేస్తున్న విజయవాడకు చెందిన సిద్ధిఖి మహమ్మద్‌ (29) రాంమనోహర్‌ లోహియా (ఆర్‌ఎంఎల్‌) ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. వారం క్రితం ఆయనకు కరోనా సోకడంతో నోయిడాలోని ఓ ఆస్పత్రిలో చేరారు.
 
ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ తీవ్రమై పరిస్థితి విషమించడంలో ఆయనను ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రికి తరలించారు. కానీ, అక్కడ చేర్చిన కొద్ది గంటల్లోనే సిద్ధిఖి ప్రాణాలు విడిచారు. ఆస్పత్రి సిబ్బందే అంత్యక్రియలను పూర్తిచేశారు. విజయవాడకు చెందిన సిద్ధిఖీకి నెల రోజుల క్రితమే వివాహమైంది. ఆయన భార్య, తల్లి కూడా కరోనాతో బాధపడుతున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments