Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే.. భర్త తాగి వచ్చి కయ్యానికి దిగితే..?

Advertiesment
స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే.. భర్త తాగి వచ్చి కయ్యానికి దిగితే..?
, సోమవారం, 12 ఏప్రియల్ 2021 (09:44 IST)
Bangles
స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే.. ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీ దేవి నివాసం వుంటుందని ప్రశస్తి. మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక, వీటి శబ్దం శుభాలను, అనురాగాలను పెంచుతుంది. సుఖ సంతోషాలు కరువైనవారు పసుపు రంగు పూలు ధరించండి, క్రమేపీ స్థితి మెరుగవుతుంది. పెళ్ళి చూపులప్పుడు ఎరుపు పూలు, పసుపు పూలు కలిపి మాలకట్టి ధ‌రించండి వివాహం విషయంలో కన్యలకు ఎంతో శుభకరంగా ఫలితాలొస్తాయి. అప్పుల బాధ ఎక్కువగా వుంటే తెలుపు పూలు ధరించటం వల్ల రుణ బాధలు తగ్గుతాయి.
 
సంపదలను, ఎక్కువగా ప్రదర్శించ‌డం వల్ల నరఘోష ఏర్పడుతుంది. తద్వారా చెడు జరుగుతుంది. అలంకారాదులు సాధారణంగా ఉండేలా చూసుకోవటం, సాధారణ జీవిత విధానాన్ని పాటించటం ఇలా నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు. ఆడపడుచులు, అత్తమామలతో విభేదాలు ఎక్కువైతే, వారు మిమ్మలను ఇబ్బందులు పెడుతుంటే వారు పడుకునే దిండు కింద తులసి వేరు ఉంచండి వారు మిమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటారు. విరోధాలు తగ్గిపోతాయి. వంట చేసేప్పుడు రెండు బియ్యం గింజలు భక్తిగా అగ్నికి సమర్పించండి… వంటకాలు ఎంతో రుచిగాను, ఆరోగ్యకరంగాను ఉంటాయి.
 
భర్త తాగి వచ్చి హింస పెడుతుంటే ఉదయం పూట టిఫిన్ చేసిన తరువాత ఒక చిన్న స్పూన్ అంటే సుమారు అర గ్రాము కరక్కాయ పౌడరును ఆరు చెంచాల నీటిలో కలిపి తాగించండి. ఇలా అరవై రోజులు చేస్తే వాళ్లకు తాగుడుపై విరక్తి కలుగుతుంది. కరక్కాయ పొడి ఆరోగ్యానికి చాలామంచిది. మొదట దీనిని తాగనని మారాం చేస్తారు. కొద్దిగా బతిమాలి తాగించటం అలవాటు చేయండి. ఇలా చేస్తే వారు తాగుడు దూరంగా వుంటారు.  
 
మంచి తీర్థంలో రెండు తులసి దళాలు వేస్తే అవి మానస సరోవర జలాలంత పవిత్రమవుతాయి. భర్త బయటకు వెళ్ళుటకు షర్ట్ వేసుకుంటుంటే, గుండీలు మీరు పెట్టండి. మీ కుడి చేతిని తాకి వెళ్లమనండి. భర్తకు ఆ రోజు సంపాదనా, విజయం సంతోషం వెంట ఉంటాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#SomvatiAmavasya రావిచెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే..