Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొబ్బరి దీపం వెలిగిస్తున్నారా? నేతిని మాత్రమే వాడాలట!

Advertiesment
కొబ్బరి దీపం వెలిగిస్తున్నారా? నేతిని మాత్రమే వాడాలట!
, మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (15:36 IST)
Coconut Lamp
కొబ్బరి దీపం వెలిగించడం ద్వారా కలిగే ఫలితాలేంటో తెలుసుకుందాం.. కొబ్బరి దీపం ముఖ్యంగా దేవతలకు వెలిగించరు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కాలంటే మాత్రమే కొబ్బరిలో దీపం వెలిగిస్తారు.

చట్టపరమైన ఇబ్బందులు తొలగిపోవాలంటే.. ఆర్థిక ఇబ్బందుల నుంచి, దారిద్ర నాశనానికి కొబ్బరి దీపం వెలిగించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అలాగే కృష్ణ, శుక్ల పక్ష అష్టమి రోజున కాలభైరవునికి కొబ్బరి దీపం వెలిగించడం ద్వారా శుభఫలితాలుంటాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. ఏలినాటి శనిగ్రహదోషాల ప్రభావం తగ్గుతుంది. 
 
అలాగే సోమవారం పూట వచ్చే శుక్ర హోరలో కొబ్బరి దీపాన్ని వెలిగించడం చేయాలి. కొబ్బరి దీపాన్ని వెలిగించేందుకు నేతిని వాడాలి. నేతిని తప్ప ఇతర నూనెలను వాడకూడదు.

వివాహ అడ్డంకులు తొలగిపోవాలన్నా, వ్యాపారాభివృద్ధి చెందాలన్నా.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా కొబ్బరి దీపాన్ని వెలిగించడం చేయాలి. అమ్మవారి సన్నిధానంలో కొబ్బరి దీపాన్ని వెలిగించవచ్చు. ఇలా చేస్తే.. అదృష్టంతో పాటు సిరిసంపదలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం