స్వదేశంలో ఐపీఎల్ 14వ సీజన్ పోటీలు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లు ఆరంభం నుంచే రసవత్తరంగా సాగుతున్నాయి. ఇందులోభాగంగా రెండోరోజు చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో సీఎస్‌కే ఘన విజయం సాధించింది.
ధోని సారధ్యంలోని సీఎస్‌కేకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నైకి శుభారంభం దక్కలేదు. 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ(36), రైనా(54) మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. దీంతో జట్టు స్కోరు 60 పరుగుల వద్ద మొయిన్ అలీ ఔటయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన రాయిడుతో కలిపి రైనా చెలరేగి ఆడాడు. చివర్లో సామ్ కరన్ 15 బంతుల్లో 34 చెలరేగి ఆడడంతో చెన్నై జట్టు 188 పరుగులు చేసింది. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ కాపిటల్స్ 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.
శిఖర్ ధావన్ దాడికి చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు చతికిలపడ్డారు. ధావన్ 54 బంతుల్లో పది ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 85 పరుగులు చేయగా, పృథ్వీ షా 38 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 72 రన్స్ చేశాడు. దీంతో రిషభ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు తన తొలి మ్యాచ్‌లోనే 7 వికెట్ల తేడాతో చెన్నైపై ఘనవిజయం సాధించింది.
అయితే గతంలో ఐపీఎల్‌లో ఛాంపియన్లుగా నిలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జరిగిన తొలి మ్యాచ్‌లోనే ఓడిపోవడంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల ఆటగాల్లున్నప్పటికీ టోర్నీలో ప్రదర్శన పేలవంగా ఉంది. మిగతా మ్యాచ్‌లలోనైనా మంచి ప్రదర్శన కనిపించాలని అభిమానులు కోరుతున్నారు.