Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీకి కెప్టెన్‌గా పంత్.. ఐపీఎల్ హక్కులు యప్‌టీవీకే

Advertiesment
ఢిల్లీకి కెప్టెన్‌గా పంత్..  ఐపీఎల్ హక్కులు యప్‌టీవీకే
, మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (19:38 IST)
ఐపీఎల్‌ 14వ సీజన్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌ గైర్హాజరీలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రిషబ్‌ పంత్‌ ఎప్పుడెప్పుడు బరిలోకి దిగాలని ఎదురుచూస్తున్నాడు. అసలే దూకుడుకు మారుపేరుగా నిలిచిన పంత్‌కు ఇప్పుడు కెప్టెన్సీ బాధ్యతలు అదనంగా వచ్చి చేరాయి. 
 
కాగా ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 10న చెన్నై వేదికగా సీఎస్‌కేతో ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రాక్టీస్ అనంతరం రిషబ్‌ పంత్‌ ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తాను కప్పు గెలిచినా, గెలవకున్నా మంచి కెప్టెన్ గా మాత్రం పేరుతెచ్చుకుంటానని చెప్పాడు. 
 
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ఈ నెల 9న ప్రారంభం కానుంది. ఐపీఎల్ డిజిటల్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను యప్ టీవీ సొంతం చేసుకుంది. 
 
ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యప్‌టీవీ సబ్‌స్క్రైబర్లు ఐపీఎల్ మ్యాచ్‌ల లైవ్‌ మ్యాచ్‌లను వీక్షించగలుగుతారు. అలాగే, దాదాపు వంద దేశాల్లో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్‌కు మ్యాచ్‌లను వీక్షించే అవకాశం దక్కింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహారాష్ట్రలో కరోనా విశ్వరూపం.. ముంబైలో ఐపీఎల్ మ్యాచ్‌లకు అనుమతి