Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెంచుకుంటానని తెచ్చి 13 ఏళ్ల బాలికకు వివాహం... నిద్రమాత్రలిచ్చి శోభనం...

గుంటూరు జిల్లాలో ఓ మైనర్ బాలిక పట్ల ఆమె మేనత్త దారుణానికి పాల్పడింది. బాలికను పెంచుకుంటానని చెప్పి తీసుకుని వచ్చి ఆమెను 35 ఏళ్ల యువకునికిచ్చి పెళ్లి చేసింది. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన పాతూరి వెంకయ్య, పార్వతి దంపతుల 13

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (20:57 IST)
గుంటూరు జిల్లాలో ఓ మైనర్ బాలిక పట్ల ఆమె మేనత్త దారుణానికి పాల్పడింది. బాలికను పెంచుకుంటానని చెప్పి తీసుకుని వచ్చి ఆమెను 35 ఏళ్ల యువకునికిచ్చి పెళ్లి చేసింది. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన పాతూరి వెంకయ్య, పార్వతి దంపతుల 13 ఏళ్ల కుమార్తెను పెంచుకుంటానంటూ బాలిక మేనత్త నాగలక్ష్మి తన ఊరికి తీసుకవచ్చింది. 
 
బాలికను పాఠశాలకు కూడా పంపిస్తోంది. ఆమె 5వ తరగతి చదువుకుంటోంది. ఐతే ఏమి ఆలోచన చేసిందో తెలియదు కానీ గత నెల నవంబరు 25న ఆ బాలికను కందుకూరు తీసుకెళ్లింది. అక్కడ మాలకొండ స్వామి దేవాలయంలో 35 ఏళ్ల మనోజ్‌తో గుట్టుచప్పుడు కాకుండా వివాహం చేయించేసింది. 
 
బాలికకు పెళ్లి చేస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులకు కూడా తెలియదు. పెళ్లి చేసిన వెంటనే అభంశుభం తెలియని బాలికను శోభనం గదిలోకి పంపింది. పాలలో నిద్రమాత్రలు కలిపి అఘాయిత్యానికి పాల్పడ్డాడు మనోజ్. తెల్లారిన తర్వాత బాలికకు మెళకువ వచ్చి తనను విడిచిపెట్టాలని ప్రాధేయపడినా వదలక చిత్రహింసలకు గురిచేసింది. బాలిక తల్లి తన బిడ్డ ఎలా వుందోనని వచ్చిన తర్వాత కానీ అసలు విషయం బయటకు వచ్చింది. జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments