Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 161కి చేరిన కరోనా కేసులు.. విజయవాడలో తొలి కరోనా మృతి

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (11:03 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఏపీలో శుక్రవారం 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఏకంగా 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా సోకిన వారందరూ ఢిల్లీకి వెళ్లొచ్చిన వారేనని అధికారులు గుర్తించారు.  కృష్ణా జిల్లాలో 23, గుంటూరు లో 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
 
మొత్తం నెల్లూరు లో 32 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా కేసులు ఏపీలో 161కు వెళ్లాయి. 14 కేసులకు ఢిల్లీతో లింకులు ఉన్నాయని అధికారులు గుర్తించారు. అత్యధికంగా విజయవాడ నగరంలో 18 కేసులు నమోదు అయ్యాయి. కడపలో ఒక కేసు.. విశాఖలో మూడు కేసులు నమోదు అయ్యాయి.
 
మరోవైపు ఆంధప్రదేశ్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. ఇదే విషయాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఏపీ రాజధాని ప్రాంతమైన విజయవాడలోని భవానీపురం ఏరియాలో ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్ నమోదు అయ్యింది.
 
ఈ కుటుంబంలోనే ఏకంగా ఐదుగురికి పాజిటివ్ రావడం పెద్ద కలకలం రేపగా ప్రస్తుతం తొలి కరోనా మరణం కూడా అక్కడే సంభవించింది. విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ జమాతే సభకు వెళ్లి రాగా.. ఆ వ్యక్తి తండ్రి కరోనాతో మృతిచెందాడు. మరణానంతరం పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. అనంతరం ఆ కుటుంబంలోని మిగిలిన వారికి కూడా కరోనా సోకింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments