Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 28న విశాఖకు సీఎం జగన్ క్యాంపు ఆఫీసు??? (video)

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (09:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తాను తలపెట్టిన కార్యానికి ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు ఎదురైనా నెరవేర్చాలన్న పట్టుదలతో ఉన్నట్టు ఉన్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలించాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగానే ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ఈ నెల 28వ తేదీ నుంచి తరలించనున్నట్టు ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నెల 28వ తేదీ గురువారం ఉదయం 8.30 గంటల నుంచి తన కార్యకలాపాలను విశాఖ కేంద్రంగా ప్రారంభించాలని నిర్ణయించినట్టు సమాచారం. 
 
ఈ సీఎం క్యాంపు కార్యాలయం కూడా విజ్ఞాన్ కాలేజీకి సమీపంలో ఉన్న గ్రేహౌండ్స్ కాంపౌడ్‌లో ఏర్పాటు చేశారు. నిజానికి సీఎం క్యాంపు కార్యాలయన్ని వైజాగా మిలీనియం టవర్‌లో ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. అయితే, ఇక్కడ ఉన్న అనేక ఐటీ కార్యాలయ నుంచి తీవ్రవ్యతిరేక రావడంతో సీఎం జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుని వేరే చోట తన క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. 
 
అయితే, సీఎం క్యాంకు కార్యాలయం తరలింపునకు సంబంధించి వైకాపా శ్రేణుల నుంచిగానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం లేదు. కానీ, సీఎం క్యాంపు కార్యాలయం తరలింపు మాత్రం తథ్యమన్న రీతిలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాను ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదనలో భాగంగానే సీఎం క్యాంపు కార్యాలయాన్ని జగన్ విశాఖకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే, లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతి, జ్యూడీషియల్ కేపిటల్‌గా కర్నూలు చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments