Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాపింపజేస్తున్నావంటూ యువతిపై దాడి..

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (08:20 IST)
కరోనా వైరస్ భయం ఇప్పట్లో పోయేలే కనిపించడంలేదు. ఫలితంగా అనేక మందిపైదాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా, చైనీయులను పోలిన వారిపై ఈ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా మణిపూర్‌కు చెందిన ఓ యువతిని చైనీయురాలిగా భావించిన గురుగ్రామ్ వాసులు కొందరు దాడికి తెగబడ్డారు. ఈ దాడికి పాల్పడింది కూడా ఓ పెద్దావిడ కావడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గురుగ్రామ్‌లోని ఫైజాపూర్‌లో 20 ఏళ్ల మణిపూర్ యువతి చోంగ్ హోయి మిసావో ఇటీవల తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అక్కడ ఆమెతో కలిసి భోజనం చేసింది. తిరిగి తన ఇంటికి బయలుదేరింది. 
 
ఆ సమయంలో ఆ ప్రాంత వాసులు కొందరు ఆ యువతిని 'కరోనా' అని పిలుస్తూ అల్లరి చేస్తూ ఏడిపించారు. ఇంతలో ఓ పెద్దావిడ ఆ యువతిని అడ్డుకుని కరోనా వ్యాపింపజేసేందుకు వచ్చావా? అంటూ నిందిస్తూ ఆమెను కర్రతో చితకబాదింది. చుట్టుపక్కల వారు కూడా ఆ యువతిపై దాడికి తెగబడ్డారు.
 
వారనుంచి తప్పించుకుని ఇంటికెళ్లిన ఆ యువతి.. జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దాడి ఘటనపై ఆ యువతి స్పందిస్తూ, గ్రామంలోని స్నేహితురాలిని కలిసేందుకు వెళ్లానని, భౌతిక దూరం పాటిస్తూ వారింట్లో భోజనం చేశానని యువతి తెలిపింది. 
 
అనంతరం తిరిగి వెళ్తుండగా ఓ పెద్దావిడ తనను ఆపి కరోనా వైరస్‌ను వ్యాపింపజేస్తున్నావంటూ నిందించిందని, రహదారిపైకి వెళ్లొద్దంటూ బెదిరించిందని తెలిపింది. అక్కడితో ఆగకుండా కర్రతో తనపై దాడిచేసిందని, ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులు కూడా తనపై దాడిచేశారని విలపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments