ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్. తిండిలేక జనం అల్లాడుతుంటే మద్యాన్ని ప్రభుత్వం విక్రయించడం ఏమిటో అర్థం కాలేదన్నారాయన. సిఎం జగన్ ఎందుకు ఇలా చేస్తున్నాడని ప్రశ్నించారు. అసలు జగన్‌కు ఆలోచించే శక్తి ఉందా అంటూ ప్రశ్నించారాయన.
నేను సిఎంను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని మద్యం అడిగారా... కరోనా విపత్తు సమయంలో జనం కడుపునిండా తిండి అడుగుతున్నారు. సామాన్యుల పరిస్థితి హీనంగా తయారైంది. కాబట్టి వారిని ఆదుకోవాలి. ఇప్పటికీ ఆకలిచావులు కొనసాగుతున్నాయి. ఎంతోమంది అర్థాకలితో మరణిస్తున్నారు కూడా.
అందుకే ఈ వైన్ షాపులను మూసివేయాలని కోరుతున్నాను. ఇప్పటికైనా జగన్ ఆలోచించాలి. ముఖ్యమంత్రి హోదాలో ఆయన నిర్ణయాలన్నీ ఉండాలి అంటూ కె.ఎల్.పాల్ సున్నితంగా విమర్శించారు. గ్రామాల్లోను, మారుమూల ప్రాంతాల్లోను దుర్భరమైన పరిస్థితిని కొంతమంది అనుభవిస్తున్నారు. వారి దగ్గరికి వెళ్ళండి, వారిని కాపాడండి, వారికి చేతనైన సాయం చేయండి అంటూ కోరారు కె.ఎ.పాల్. ఎప్పుడూ కె.ఎ.పాల్ విమర్సించే నెటిజన్లు ఆయన తాజాగా విడుదల చేసిన వీడియోను చూసి ఏమంటారో చూడాలి.