Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎకరంలో... కేసీఆర్ మహారాజ ప్యాలెస్.. 22న గృహప్రవేశం.?

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (12:21 IST)
ఎకరంలో... కేసీఆర్ మహారాజ ప్యాలెస్..
నాలుగు ముఖద్వారాలు..
స్పెషల్ డిజైన్..
22న గృహప్రవేశం.?
 
విశాలమైన సమావేశ మందిరం..
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కొత్త ఫామ్ హౌస్ నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతుంది. సీఎం కెసిఆర్ కొంత కాలంగా దగ్గరుండి మరి ఈ కొత్త ఇంటిని నిర్మాణాలను థన అభిరుచికి అనుగుణంగా నిర్మించుకుంటున్నారు. ఈ విలాసవంతమైన రాజ ప్రసాదం దాదాపు ఎకరం విస్తీర్ణంలో ఈ కొత్త ఇంటి నిర్మాణం జరుగుతోందని తెలుస్తోంది.
 
గృహప్రవేశం 22న..?:
ఈనెల 22న ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేసే అవకాశం ఉంది. అయితే… ఇంకా పనులు పూర్తి అయ్యేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఈ నూతన గృహప్రవేశం వాయిదా పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.
 
సర్వాంగ సుందరంగా..!!
ఈ కొత్త ఇల్లు సర్వాంగ సుందరంగా ఉండబోతుందని తెలుస్తోంది. కొత్త ఇంటి ఫోటోలను "పరిశోధన పాత్రికేయులు" ఎక్స్ క్లూజివ్ గా సంపాదించింది. ఎన్ని కార్లు వచ్చినా ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. దేశ ప్రముఖులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు సహా ఇతర అతిథిలు ఎవరు వచ్చినా.. వారి వారి స్థాయిలను బట్టి  సమీక్షలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవటానికి పెద్ద, పెద్ద హాళ్ళు నిర్మాణంలో ఉన్నాయి. కాన్ఫరెన్స్ హాల్, భోజనం చేయటానికి స్పెషల్ రూమ్, గెస్ట్ ల కోసం అవుట్ హౌస్  కూడా ఉండబోతుంది.
 
తెలంగాణ భవన్ లాగే.. స్పెషల్..!!
ఇక సీఎం కెసిఆర్ ఉండే ఈ నూతన గృహం ప్రత్యేకంగా ఉండబోతుంది. తెలంగాణ భవన్ ఎలా ఉంటుందో... సరిగ్గా అలాగే… అక్కడ కూడా స్పెషల్ గా డిజైన్ చేశారని, ఆందుకోసం అనేక మంది ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ లతో చర్చలు జరిపి... చివరకు ఒక ప్రత్యేక శైలిలో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. నిజాం రాజుల తరహా డిజైన్ ఉంటుందని ఫామ్ హౌస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. 
 
ఈ ఇంటికి నాలుగు ముఖ ద్వారాలు..!! 
సీఎం కేసీఆర్ ఇష్టపడి నిర్మించుకుంటున్న ఈ కొత్త ఇంటికి నాలుగు దారులు ఉండబోతున్నాయి.. ఒక్కోదారి నుంచి వస్తే ఒక్కో స్టైల్ లో కనిపించేలా డిజైన్ చేశారని సమాచారం. ఒకసారి ఈ ఇంట్లోకి ప్రవేశించిన వారికి సహాయకుల సహాయం లేకుండా ముందుకు వెళ్ళలేనట్లు నిర్మాణం కొనసాగుతుంది.
 
ఆంటిక్ వాల్యూ.!!
అంత పెద్ద ఇంట్లో వాడే సామాగ్రి కూడా అంతే వైవిధ్యంగా ఉండేలా సీఎం కేసీఆర్ శ్రద్ద తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అక్కడ సెల్ జామర్లు ఉంటాయి.. కానీ సీఎం. కుటుంబ సభ్యుల ఫోన్లు మాత్రమే పనిచేసే విధంగా సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ వస్తువు ఎక్కడ ఉండాలనే విషయంలో సీఎం కేసీఆర్ ప్రముఖ వాస్తు నిపుణుల అభిప్రాయం తీసుకుంటున్నారని తెలుస్తోంది. 
 
కొసమెరుపు..!!
ఇంతటి విశాలమైన భవనం నిర్మించడానికి ఎంత ఖర్చు పెడుతున్నారనే విషయం మాత్రం తెలియరాలేదు. అయినా 'రాజు తలుచుకుంటే...-కొదవేం ఉంది.'

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments