Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యబాబోయ్... మగాడిగా ఉండలేను.. హిజ్రాగానే జీవిస్తా...

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (13:47 IST)
మగాడిగా ఉండలేను.. హిజ్రాగానే జీవిస్తానంటూ పోలీసుల ఎదుట బోరున విలపించాడో ఓ యువకుడు. పైగా, తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లేందుకు ససేమిరా అన్నాడు. దీంతో ఏం చేయాలో.. సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే....
 
జిల్లాలోని రామకుప్పం మండలం బగలనత్తం గ్రామానికి చెందిన మురుగేశ్.. పలమనేరు పట్టణంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్నాడు. గత నెలలో ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి అమ్మాయిలామారి పలమనేరు పోలీసుల వద్దకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న మురుగేశ్ తల్లిదండ్రులు పోలీసులకు నచ్చజెప్పి తమ బిడ్డను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లారు. 
 
కానీ, సోమవారం మురుగేశ్ మళ్లీ కొంతమంది హిజ్రాలను వెంటబెట్టుకుని స్టేషన్‌కు వచ్చాడు. తాను మగాడిగా జీవించలేనని, అమ్మాయిగా జీవిస్తానని ఎంత వేడుకుంటున్నా కుటుంబ సభ్యులు సమ్మతించకుండా వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments