Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారికి సీఈసీ క్లాస్.. దొంగ ఓట్ల గోలేంటి?

Webdunia
బుధవారం, 12 జులై 2023 (09:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు క్లాస్ పీకారు. ఏపీలో దొంగ ఓట్లు భారీగా నమోదవుతున్న ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీకి పిలిపించి మరీ మందలించారు. ఈసీఐ డిప్యూటీ కమిషనర్‌తో ఏకంగా మూడు గంటల పాటు ఈ భేటీ జరిగింది. ఈ నెల 21వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు బూత్ స్థాయి అధికారులతో ఇంటంటి తనిఖీలు చేపట్టాలని, ఆ సమయంలో అన్ని పార్టీలకు చెందిన నేతలు ఈ తనిఖీల్లో పాలు పంచుకునేలా చూడాలని ఆదేశించారు. 
 
ఏపీలో దొంగ ఓట్లు భారీగా నమోదైనట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వచ్చి కలవాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నుంచి పిలుపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఆయన మంగళవారం ఆగమేఘాలపై ఢిల్లీ వెళ్లి... ఈసీఐ డిప్యూటీ కమిషనర్ 3 గంటలపాటు సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2024 కార్యక్రమం సన్నద్ధత, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు వంటి విషయాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు బూత్ స్థాయి అధికారులను ఇంటింటికి పంపి వివరాలను తనిఖీ చేయిస్తామని తెలిపారు. అంతకుముందు రోజు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

Samantha: రామ్ చరణ్, కార్తీతో సమంత స్పెషల్ సాంగ్ చేస్తుందా?

Manuch Manoj: బాలీవుడ్ లో మిరాయ్ రిలీజ్ చేస్తున్న కరణ్ జోహార్

మోసం చేసిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి - కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments