Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్‌లో స్టూడియో జెతో భాగస్వామ్యం చేసుకున్న టర్టల్ వ్యాక్స్ ఇండియా

Advertiesment
image
, సోమవారం, 10 జులై 2023 (23:51 IST)
అవార్డు గెలుచుకున్న, చికాగో కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కార్-కేర్ కంపెనీ, Turtle Wax, Inc ఈ రోజు తమ రెండు కొత్త కో బ్రాండెడ్ కార్-కేర్ స్టూడియోలను ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, గుంటూరులో ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ రెండు స్టూడియోలు స్టూడియో Jతో భాగస్వామ్యం చేసుకుని ప్రారంభించారు. విజయవాడ స్టూడియో NH-5 వద్ద, నెక్సా షోరూమ్ పక్కన ఉంది. గుంటూరు స్టూడియో డోర్ తోళ్ల షాప్ సెంటర్, పట్టాభిపురం రోడ్, కృష్ణ నగర్ వద్ద వుంది. అత్యాధునిక Turtle Wax డిటైలింగ్ టెక్నాలజీలు, అత్యున్నత అర్హత కలిగిన, శిక్షణ పొందిన సేవా సిబ్బందితో కూడిన ఈ Turtle Wax Car Care Studio విస్తృత శ్రేణి కార్ డిటైలింగ్ సర్వీస్‌లు, ఉత్పత్తులను కారు ప్రేమికుల వ్యక్తిగతీకరించిన అభిరుచికి తగినట్టుగా అందిస్తుంది.
 
ఆంధ్రప్రదేశ్‌లో సంవత్సరాల తరబడి నైపుణ్యంతో కూడిన కారు సంరక్షణ మరియు డిటైలింగ్‌ను Studio J తీసుకు వస్తుంది. Turtle Wax యొక్క డిటైలింగ్ ఆవిష్కరణ మరియు నైపుణ్యంతో జత చేయబడటం ద్వారా అత్యుత్తమ నాణ్యత మరియు కస్టమర్ సేవను ఉన్నతమైన విలువను అందించే లక్ష్యంతో, Turtle Wax కార్ కేర్ స్టూడియో వృత్తిపరమైన వాహన నిర్వహణ మరియు పరిశుభ్రత కోసం వినియోగదారుల డిమాండ్ లను తీర్చనుంది.  ఈ స్టూడియో Turtle Wax యొక్క సిరామిక్ మరియు గ్రాఫేన్ శ్రేణి నుండి అనేక రకాల కేర్ ప్యాకేజీలను అందిస్తోంది, సాటి లేని ఫలితాలను అందించడానికి తాజా సాంకేతికతలను ఉపయోగిస్తుంది. కార్ కేర్ స్టూడియోలోని కస్టమర్‌లు పేటెంట్ గ్రాఫేన్ టెక్నాలజీతో కూడిన హైబ్రిడ్ సొల్యూషన్స్ మరియు హైబ్రిడ్ సొల్యూషన్స్ ప్రో వంటి Turtle Wax యొక్క ప్రపంచంలోని ఇష్టమైన డిటైలింగ్ ఉత్పత్తుల ద్వారా అందించబడిన ప్రొఫెషనల్ ఫలితాలను పొందుతారు.
 
Turtle Wax కార్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సాజన్ మురళి పురవంగర ఈ ప్రారంభం గురించి మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్, మా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ మరియు మేము ఇక్కడ గణనీయంగా పెరుగుతున్న ఆసక్తిని చూశాము. గుంటూరు మరియు విజయవాడలో ఈ రెండు-కొత్త స్టూడియోలతో, రాష్ట్రవ్యాప్తంగా అత్యుత్తమ, ప్రీమియం క్వాలిటీ కారు డిటైలింగ్ సర్వీస్‌ను అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. అందుబాటులో ఉన్న వినూత్నమైన DIFM సేవలను అందించటానికి అతిపెద్ద శ్రేణి వర్గాలు మరియు ఉత్పత్తులను కలిగి ఉన్నందుకు బ్రాండ్ గర్విస్తోంది. స్టూడియో Jతో మా భాగస్వామ్యం ఈ ప్రాంతంలో మంచి కార్ కేర్ సేవలు మరియు ప్రయోజనాలను అందించడంలో మాకు సహాయపడుతుందని మేము విశ్వసిస్తున్నాము. మేము మా డీలర్ నెట్‌వర్క్‌ పట్ల  గర్వంగా  వున్నాము మరియు రాబోయే సంవత్సరాల్లో దానిని బలోపేతం చేయడం కొనసాగిస్తాము మరియు దేశంలోని టైర్ టూ మరియు టైర్ త్రీ పట్టణాలలో కూడా కార్యకలాపాలు విస్తరించనున్నాము..." అని అన్నారు.
 
ఈ నూతన భాగస్వామ్యం గురించి ఈ రెండు స్టూడియోల యజమానులు శ్రీ అసీమ్ జునేజా మరియు శ్రీ అభిషేక్ జునేజా మాట్లాడుతూ, “మేము Studio J వద్ద నూతన ఆవిష్కరణలలో శ్రేష్ఠతను అందించడానికి మరియు కస్టమర్‌లకు ఆహ్లాదపరిచే అనుభవాలను అందించేందుకు కృషి చేస్తున్నాము. కార్ల సంరక్షణలో గ్లోబల్ లీడర్‌‌తో భాగస్వామిగా ఉండటానికి మరియు వారికి ప్రాతినిధ్యం వహించడానికి మేము సంతోషిస్తున్నాము. Turtle Waxతో ఈ అనుబంధం మమ్మల్ని మరింతగా పైకి తీసుకెళ్తుందని, ఇక్కడ కార్ ప్రేమికులకు సంతోషం అందిస్తుందని విశ్వసిస్తున్నాము" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎలెన్ మస్క్ చిన్ననాటి ఫోటో.. ఎలన్ బేబీ అనే క్యాప్షన్‌తో వైరల్