Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలనొప్పి తట్టుకోలేక.. తొమ్మిదో అంతస్థు నుంచి దూకేసింది..

తలనొప్పి తట్టుకోలేక.. తొమ్మిదో అంతస్థు నుంచి దూకేసింది ఓ ఉద్యోగిని. వివరాల్లోకి వెళితే.. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిలాంజ్ టవర్‌పై నుంచి దూకి ఓ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపి

Webdunia
గురువారం, 28 జూన్ 2018 (17:44 IST)
తలనొప్పి తట్టుకోలేక.. తొమ్మిదో అంతస్థు నుంచి దూకేసింది ఓ ఉద్యోగిని. వివరాల్లోకి వెళితే.. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిలాంజ్ టవర్‌పై నుంచి దూకి ఓ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. మాదాపూర్ మిలాంజ్ టవర్‌ తొమ్మిదో అంతస్తులోని ప్రైమ్ ఎరా మెడికల్ టెక్నాలజీ ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రావణి గురువారం కార్యాలయానికి వచ్చింది. 
 
కానీ కాసేపటికే.. బాల్కనీ వద్దకు వచ్చి ఓ స్టూల్‌ను తీసుకొని అక్కడి నుంచి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడింది. గత కొన్ని నెలలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుండటంతో మానసిక ఒత్తిడితోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. కానీ కేసు నమోదు చేసుకుని శ్రావణి ఆత్మహత్యపై పలుకోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. 
 
కాగా చిత్తూరు జిల్లాకు చెందిన శ్రావణి... భర్త రామకృష్ణారెడ్డితో కలిసి మియాపూర్‌లోని మదీనాగూడలో నివాసం ఉంటుంది. శ్రావణికి ఒక బాబు కూడా ఉన్నాడు. గృహిణి అయిన శ్రావణికి వేరైమైనా సమస్యలున్నాయా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కస్టోడియల్ టార్చర్ చేసినవారంతా జైలుకు వెళ్లడం ఖాయం : ఆర్ఆర్ఆర్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments