Webdunia - Bharat's app for daily news and videos

Install App

2021-22 నుంచి 1 నుంచి 8వ తరగతి సీబీఎస్ఈ విధానం: జగన్

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (10:43 IST)
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సీఎం మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలల్లో రానున్న విద్యా సంవత్సరం 2021-22 నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) విద్యా విధానాన్ని ప్రారంభించున్నట్లు వెల్లడించారు.

ఆ తరువాత తరగతులకు వరుసగా ఒక్కో ఏడాది పెంచుకుంటూ సీబీఎస్సీ విద్యా విధానాన్ని వర్తింప చేస్తామని వివరించారు. 12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ విధానాన్ని దశలవారీగా అమలు చేయనున్నట్లు చెప్పారు. 
 
ఇందుకు సంబంధించి ఎఫిలియేషన్‌ కోసం సీబీఎస్‌ఈ బోర్డుతో చర్చించి, ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. కామన్‌ సిలబస్‌ వల్ల జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం కావడం సులభంగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల ద్వారా విద్యార్థులు ఆంగ్లంపై మరింత పట్టు సాధిస్తారన్నారు. తద్వారా మన విద్యార్థులు ఎక్కడైనా రాణించే అవకాశం ఉంటుందని సీఎం అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments