Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

ఠాగూర్
ఆదివారం, 20 ఏప్రియల్ 2025 (15:06 IST)
తిరుమల కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఘాట్ రోడ్డులోని భాష్యకారుల సన్నిధి వద్ద ఈ ప్రమాదం సంభవించింది. కారు ఇంజిన్ నుంచి పొగలు ఒక్కసారిగా వచ్చి మంటలు వ్యాపించాయి. దీంతో కారు మంటల్లో దగ్ధమైపోయింది. కారులోని ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడ్డారు. 
 
తిరుమల ఘాట్‌ రెండో రోడ్డులోని భాష్యకారుల సన్నిధి వద్ధ మోకాళ్లమెట్ల సమీపంలో ప్రయాణిస్తున్న ఒక కారు ఇంజిన్ భాగం నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు రావడం ప్రారంభమైంది. దీనిని గమనించిన కారులోని ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై వాహనాన్ని నిలిపివేసి కిందకు దిగిపోయారు. వారు దిగిన కొన్ని క్షణాల్లోనే కారులో మంటలు పెద్దవిగా వ్యాపించి వాహనాన్ని చుట్టుముట్టాయి. వారంతా చూస్తుండగానే ఆ కారు మండల్లో కాలిపోయింది. 
 
దీనిపై సమాచారం అందుకున్న తిరుమల అగ్నిమాపకదళ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే కారు చాలా భాగం కాలిపోయినప్పటికీ, మిగిలిన మంటలను వారు ఆర్పివేశారు. ఈ సంఘటన కారణంగా ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు, అగ్నిమారకదళ సిబ్బంది కారును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ???????????????????????????????????????????????????? (@maa_ooru_tirupati)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments