Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

Advertiesment
chandrababu

ఠాగూర్

, శుక్రవారం, 11 ఏప్రియల్ 2025 (23:53 IST)
శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన అందించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీరాముని ఆదర్శాలతో పాలించి, రామరాజ్యంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమన్నారు. ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి వారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఆయన రాములవారి ఆశీస్సులతో రాష్ట్రాన్ని సుభిక్షంగా మారుస్తామని ప్రతిజ్ఞ చేశారు. 
 
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ, సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా జరిగిందని, వారి దాంపత్యం అందరికీ ఆదర్శమని కొనియాడారు. 
 
"పరిపాలన అంటే శ్రీరామున పాలనలా ఉండాలి. అపుడే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు" అని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలంలో రాములోరి దర్శనం చేసుకునే అవకాశముండేదని, విభజన తర్వాత ఒంటిమిట్టలో కోదండరాముడి కళ్యాణాన్ని ప్రభుత్వపరంగా అత్యంత వైభవంగా జరపాలని నిర్ణయించామని గుర్తు చేశారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ఒంటిమిట్ట ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పరిధిలోకి తీసుకురావడం జరిగిందని, ఆలయ పరిపక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. టెంపుల్ టారిజంలో భాగంగా ఒంటిమిట్ట ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, ఆలయ ప్రాంగణంలోని చెరువును సుందరీకరణ చేస్తున్నామని తెలిపారు. ఇక్కడకు వచ్చే భక్తులకు రెండు మూడు రోజులు ఉండేలా అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దేవాలయాలు మన వారసత్వ సంపదని, వాటిని కాపాడుకోవడం మన కర్తవ్యమని ఆయన నొక్కి చెప్పారు. 
 
తన దృష్టిలో రామరాజ్యం అంటే స్వర్ణాంధ్రప్రదేశ్‌ను నిర్మించడమేనని, పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతానని ఆయన పేర్కొన్నారు. ప్రజల సహకారంతో ఆర్థిక అసమానతలు తగ్గించి, సుభిక్షమైన రాష్ట్రాన్ని నిర్మిస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన అందించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)