Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

Advertiesment
nara lokesh

ఠాగూర్

, శుక్రవారం, 11 ఏప్రియల్ 2025 (18:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. వచ్చేవారం నుంచి రూపాయి ఖర్చు లేకుండా ఇంటి పట్టాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అలాగే, వచ్చే రెండేళ్ళలో ఇంటి పట్టాను అమ్ముకునే హక్కు కూడా వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. మన ఇల్లు - మన లోకేశ్ అనే కార్యక్రమంలో భాగంగా, నాలుగో రోజు మధ్యాహ్నం మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సభలో తాడేపల్లి మహానాడు ప్రాంతానికి చెందిన 430 మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. శుక్రవారం మొత్తం 1030 పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. 
 
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, వచ్చేవారం నుంచి ఇంటి పట్టాను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ఒక్క రూపాయి ఖర్చుపెట్టకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. రెండేళ్లలో పట్టాను అమ్ముకునే కూడా మీకు వర్తిస్తుందన్నారు. దయచేసి ఎవరూ అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మనం ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అన్ని రంగాల్లో మంగళగిరిని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతామని, ఇందుకో మీ అందరి సహకారం కావాలన్నారు. మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని, మీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తామని వెల్లడించారు. 
 
హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు... 
 
విద్యాబుద్ధులు చెప్పాల్సిన కొందరు గురువారం విచక్షణను కోల్పోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. చిన్నపాటి తప్పులు చేసే విద్యార్థులపట్ల ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కొందరు విద్యార్థులు హోం వర్క్ చేయలేదని చెప్పుతో కొట్టారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ధర్మవరంలోని జీనియస్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు హోం వర్క్ చేయకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఉపాధ్యాయురాలు వారిని చెప్పుతో కొట్టారు. విషయం తెలిసిన బాధిత విద్యార్థులు పాఠశాలకు చేరుకుని అనితను ప్రశ్నిస్తూ దాడి చేశారు. 
 
విద్యార్థులను చెప్పుతో కొట్టడం ఏమిటని పాఠశాల యాజమాన్యం నిలదీశారు. దీంతో పాఠశాల వద్ద ఉద్రికత్త నెలకొంది. సమాచారం అందుకున్న ఒకటో పట్టణ పోలీసులు స్కూలు వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై ఎంఈవో గోపాల్ నాయక్ స్పందించారు. విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)