Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగపనులు చేసి చిప్పకూడు తిన్న చిట్టి రెడ్డికి బడాయి మాటలెక్కువ...

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (12:38 IST)
వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సెటైర్లు వేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను చిట్టి నాయుడు అంటూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పదేపదే ప్రస్తావిస్తుండటంతో బుద్ధా వెంకన్న పరోక్షంగా జగన్‌ను చిట్టిరెడ్డి అంటూ సంబోధిస్తూ ట్విట్టర్ వేదికగా ఘాటైన విమర్శలు గుప్పించారు. 
 
"చిట్టి రెడ్డి తండ్రి గెలిచిన చోట కాలర్ ఎగరేస్తాడు. కన్నతల్లిని గెలిపించుకోలేని అసమర్థుడు. అయినప్పటికీ తనదే పైచేయి అంటాడు. దొంగ పనుల కారణంగా చిప్పకూడు తిన్నా బడాయి మాటలు మాట్లాడుతుంటాడీ చిట్టి రెడ్డి... చరిత్ర మర్చిపోయారా విజయసాయిరెడ్డి గారూ!" అంటూ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు. 
 
ముఖ్యంగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేశ్‌ను ఓడించేందుకు వైఎస్ ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగాల్సి వచ్చిందని, పెయిడ్ ఆర్టిస్టులు సైతం అక్కడే మకాం వేసి లోకేశ్ ఓటమి కోసం పనిచేశారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఒక్క మంగళగిరిలోనే వైసీపీ గెలుపు కోసం రూ.200 కోట్లు ఖర్చు చేసినట్టు మీ మాటల్లోనే వెల్లడించినందుకు ధన్యవాదాలు అంటూ స్పందించారు. 

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments