Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి శ్రీనగర్ కాలనీలో అందమైన అమ్మాయిలు అంటూ...

Webdunia
బుధవారం, 21 జులై 2021 (21:45 IST)
ఆధ్మాత్మిక క్షేత్రం తిరుపతి పట్టణంలో గుట్టుగా సాగుతున్న హైటెక్ వ్యభిచార దందా గుట్టును రట్టు చేశారు పోలీసులు. తిరుపతి శ్రీనగర్ కాలనీలో రహస్యంగా సాగుతున్న దందాను వెలుగులోకి తెచ్చారు. వాట్సాప్ ద్వారా విఠులను ఆకర్షించి జోరుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
 
ఒక ఇంట్లో ఆకస్మికంగా దాడి చేసి నలుగురు విఠులు, నిర్వాహకులను అరెస్టు చేసినట్లు తిరుపతి పోలీసులు వెల్లడించారు. పోలీసుల విచారణలో నిజాలు బయటకు వచ్చాయి. ఈ వ్యభిచార దందా నిర్వహిస్తోంది ఇద్దరు మహిళలని తేల్చారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారికి చెందిన స్వప్న, లక్ష్మీప్రియగా గుర్తించారు. 
 
యువతుల ఫోటోలను సాయిచరణ్, అనిరిథ్ కుమార్ అనే ఇద్దరికి పంపినట్లు గుర్తించారు. బెంగుళూరు, గుడివాడ నుంచి యువతులను రప్పించి విటులు కోరుకున్న ప్రాంతానికి తీసుకెళ్ళి ఎంజాయ్ చేసేవారు. ఇదంతా చాలా రహస్యంగా సాగుతోంది. ముందుగా వాట్సాప్ ద్వారా వ్యాపారం మొత్తం జరుగుతుంది.
 
బేరసారాలన్నీ వాట్సాప్ లోనే ఉంటాయి. డబ్బులు మొదట్లో చాలా తక్కువగా చెబుతున్నారు. ఒక్కొక్క అమ్మాయి ఫోటోను వాట్సాప్ ద్వారా పంపిస్తారు. ఇలా తక్కువ రేటని చెబుతూనే ఎక్కువ రేట్లు ఉన్న అమ్మాయి కూడా ఉందని మరింత అందంగా ఉన్న ఫోటోలను చూపిస్తారు. 
 
ఇదంతా బేరసారాలు ముగిసిన తరువాత అడ్వాన్స్ వేయించుకుంటారు. ఇలా గత కొన్నిరోజులుగా తిరుపతి నగరంలోనే ఈ మొత్తం వ్యవహారం సాగుతోంది. ఎంతో రహస్యంగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు. ఐదుగురు యువతులు, ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై కేసులు పెట్టి యువతులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు పోలీసులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments