కరోనా వైరస్ మహమ్మారి కేవలం మనుషులకే కాదు దేవుళ్లకు కూడా నష్టం చేకూర్చిపెట్టింది. అనేక మంది తమ ఉపాధిని కోల్పోయారు. ఫలితంగా కుటుంబ పోషణ జరుగక రోడ్డుపాలయ్యారు. అలాగే, ఈ కరోనా వైరస్ దేవుళ్లకు కూడా హాని కనిగించింది. వారి ఆదాయానికి గండి కొట్టింది.
కరోనా మహమ్మారి కారణంగా కొన్ని నెలల పాటు ఆలయంలోకి భక్తులను అనుమతించలేదు. దర్శనాలను అనుమతించిన తర్వాత కూడా పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది.
ఏడాది కాలంగా ఆలయానికి రూ.800 కోట్ల నష్టం వాటిల్లిందని టీటీడీ అధికారులు తెలిపారు. 84 రోజుల పాటు భక్తులను అనుమతించకపోవడంతో హుండీ ఆదాయం తగ్గిపోయిందని చెప్పారు. కరోనా భయాల కారణంగా భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో తిరుమలకు రావడం లేదు.