Webdunia - Bharat's app for daily news and videos

Install App

గన్‌మెన్లను సరెండర్ చేసిన మాజీ మంత్రి బాలినేని.. వైకాపా నేతలపై చర్యలకు పట్టు

గన్‌మెన్లను సరెండర్ చేసిన మాజీ మంత్రి బాలినేని.. వైకాపా నేతలపై చర్యలకు పట్టు
Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (14:32 IST)
ప్రకాశం జిల్లాలో నకిలీ దస్తావేజుల స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో అధికార పార్టీకి చెందిన నేతలు అనేకమంది ఉన్నారు. అలాంటి వారితో పాటు ఈ కేసులో సంబంధం ఉన్న తన అనుచరులపై కూడా తగిన చర్యలు తీసుకోవాలంటూ జిల్లా పోలీసులు ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కానీ, పోలీసులు మాత్రం మెతక వైఖరిని అవలంభిస్తున్నారు. ఆయన మాటలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పోలీసుల చర్యకు నిరసనగా తన గన్‌మెన్లను ఆయన సరెండర్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఆయన ఓ లేఖ రాశారు. 
 
ఈ కేసులో ఉన్న ఎంతటి వారినైనా అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ కేసులో ఉన్నది అధికార పార్టీ నేతలనైనా వదిలిపెట్టవద్దన్నారు. అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. నాలుగేళ్ల నుంచే ఇలాంటి విచిత్ర పరిస్థితులు చూస్తున్నానంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. పోలీసులు తన సూచనను పెడచెవిన పెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. 
 
కాగా, ఒంగోలు జిల్లాలో తీవ్ర కలకలం రేపిన నకిలీ భూపత్రాల కేసులో ఇప్పటివరకు 10 మంది అరెస్టు అయ్యారు. వీరిలో అధికార పార్టీ నేతలు అధికంగా ఉన్నారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టవద్దని మూడు రోజుల క్రితం కలెక్టర్ సమక్షంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎస్పీని కోరారు. ఈ కేసులో తన పక్కనున్న వారినైనా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవద్దన్నారు. పోలీసులు అనధికారికంగా కొన్ని పేర్లు చెబుతున్నారని బాలినేని పేర్కొన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్ అడిగిన ప్రశ్నలకు వెంకికుడుముల హానెస్ట్ సమాధానాలు

మన సినిమాలను మనమే చంపుకుంటున్నాం.. అదే పతనానికి కారణం : అమీర్ ఖాన్

సిద్ధు జొన్నలగడ్డ... జాక్ చిత్రానికి ఆర్ఆర్ అందిస్తున్న సామ్ సిఎస్‌

మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు - సినీ దర్శకుడు గీతాకృష్ణపై కేసు

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments