మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత బాలినేని శ్రీనివాస రెడ్డికి వైకాపా అధిష్టానం తేరుకోలేని షాకిచ్చింది. ఆయనకు అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీనిపై ఆయన స్పందిస్తూ, తనకు తెలియకుండానే అనుచరులను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై పార్టీ అధినేతను కలుసుకునే యోచనలో ఆయన ఉన్నారు.
బాలినేని అనుచరులైన భవనం శ్రీనివాస రెడ్డి, పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. బాలినేనికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సస్పెండ్ చేశారు. ఈ చర్యలపై బాలినేని తీవ్ర అగ్రహానికి గురయ్యారు. తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే ఎలా సస్పెండ్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. 48 గంటల్లో తన అనుచరులను మళ్లీ పార్టీలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి ఈ అంశంపై చర్చించేందుకు బాలినేని సిద్ధమవుతున్నారు.