Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓలా ఎలెక్ట్రిక్ ఆంధ్రప్రదేశ్, ఒంగోలులో మొదటి అనుభవ కేంద్రం ప్రారంభం

Advertiesment
ola electric
, మంగళవారం, 9 మే 2023 (23:45 IST)
భారతదేశపు అగ్రగామి విద్యుత్ వాహన కంపెనీ అయిన ఓలా ఎలెక్ట్రిక్, దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా తాను తన వినియోగదారు ఉనికిని పెంపొందించుకోవాలనే తన విస్తరణ వ్యూహములో భాగంగా అనేక ఇతర నగరాలతో పాటుగా ఒంగోలులో తన మొదటి అనుభవ కేంద్రం (ఇసి) ప్రారంభాన్ని ప్రకటించింది. కొత్తగా ప్రారంభించబడిన ఈ అనుభవ కేంద్రం శివాజీ నగర్ లోని బైపాస్ రోడ్ వెంబడి నెలకొల్పబడింది.
 
కస్టమర్లకు ఒకే గొడుకు క్రింద సమీకృతమైన సేవల శ్రేణిని అందించడానికి గాను ఓలా అనుభవ కేంద్రాలు ప్రత్యేకంగా రూపకల్పన చేయబడ్డాయి.  ఈ కేంద్రాలలో కస్టమర్లు ఓలా S1 మరియు S1 ప్రో స్కూటర్లను టెస్ట్-రైడ్ చేయడానికి మరియు కొనుగోలు ప్రక్రియ అంతటా నిపుణుల మార్గదర్శనం తీసుకోవడానికి వీలు కల్పించబడుతుంది. కస్టమర్లు ఓలా యాప్ ద్వారా తమ కొనుగోలును ఖరారు చేసుకోవడానికి ముందు తమకు గల ఆర్థికసహాయ ఆప్షన్ల గురించి కూడా వివరమైన సమాచారము పొందగలుగుతారు. అదనంగా, ఈ కేంద్రాలు ఓలా స్కూటర్ల విక్రయానంతర సంరక్షణ మరియు నిర్వహణ కొరకు ఒకే-చోటు గమ్యాలుగా పని చేస్తాయి. ఓలా ఇప్పుడు తన 2,50,000 మంది కస్టమర్ల కమ్యూనిటీకి వారి సర్వీస్ ఆవశ్యకతలు మరియు అవసరాలన్నింటికీ సులభమైన ప్రాప్యతను అందిస్తూ కేవలం 20 కిలోమీటర్ల దూరములోనే ఉంది.
 
వివిధ శ్రేణిలో ఆవశ్యకతలు ఉన్న కస్టమర్లను సంతృప్తి పరచడం కోసం, ఇప్పుడు లభిస్తున్న మొత్తం ఆరు మోడళ్ళతో ఓలా ఇటీవలనే తన ప్రోడక్టు పోర్ట్‌ఫోలియోను విస్తృతం చేసింది. ఓలా S1 శ్రేణి లోని ప్రతి వేరియంట్, అత్యాధునికమైన టెక్నాలజీ మరియు సాటిలేని పనితీరుతో జత కలిసి ఒక చక్కని మరియు కనీసమైన డిజైన్ కలిగి ఉంది. S1 మరియు S1 ప్రో మోడళ్ళ యొక్క అద్భుత విజయం, 30%కి పైగా మార్కెట్ వాటాతో ఓలాను అగ్రగామి ఎలెక్ట్రిక్ టూ-వీలర్ తయారీదారుగా అగ్రస్థానాన నిలిపింది.
 
ఇండియాలో తన భౌతిక స్పర్శా కేంద్రాలను విస్తృతపరచుకోవడానికి గాను ఓలా గణనీయంగా ముందడుగు వేస్తోంది. ఈ అనుభవ కేంద్రాల జోడింపుతో, కంపెనీ రాబోవు రోజుల్లో 500 స్పర్శా కేంద్రాలను చేరుకునే మార్గములో పయనిస్తోంది. అంతేకాకుండా, ఆగస్టు 15వ తేదీ నాటికి 1,000 స్పర్శా కేంద్రాలను చేరుకోవాలని ఓలా లక్ష్యంగా చేసుకొంది మరియు దానిని సాధించే దిశగా తీవ్రంగా దూకుడుతో పని చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్నాటక అసెంబ్లీ సమరం - పోలింగ్‌కు కట్టుదిట్టంగా ఏర్పాట్లు