Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థినిని తల్లిని చేసిన ఉపాధ్యాయుడు.. పలుమార్లు అత్యాచారం... చివరకు...

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (14:11 IST)
ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజవర్గంలో ఓ దారుణ ఘటన జరిగింది. తన వద్ద చదువుకునే 16 యేళ్ల బాలికను కామాంధుడైన ఉపాధ్యాయుడు అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చి పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కదిరి నియోజకవర్గానికి చెందిన 16 యేళ్ల బాలిక తొమ్మిది నెలల క్రితం ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతుండగా నీళ్లు తాగేందుకని స్టాఫ్ గదిలోకి వెళ్లింది. అక్కడ ఒంటరిగా ఉన్న ఉపాధ్యాయుడు రెడ్డినాగయ్య అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో విద్యార్థిని మిన్నకుండిపోయింది. 
 
అప్పటి నుంచి ఆ కామాధుడు.. ఆ విద్యార్థినిపై అవకాశం ఉన్నపుడల్లా అత్యాచారం చేయసగాడు. ఈ క్రమంలో గత శనివారం ఆ బాలికకు కడుపు నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమె నిండు గర్భవతిగా గుర్తించి, కాన్పు చేశారు.
 
అయితే, బాధితురాలికి రక్తం తక్కువ ఉండడంతో వైద్యులు కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించాలని సూచించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కదిరి డీఎస్పీ శ్రీలత అనంతపురం ఆసుపత్రిలో బాలికను పరామర్శించిన అనంతరం వివరాలు వెల్లడించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం, 376, 506 సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్‌తో అదరగొట్టింది.. కానీ అక్కడ దొరికిపోయిన సాయి పల్లవి

పుష్పలో ధనంజయ జాలీ రెడ్డి ప్రియురాలు ధన్యతతో ఎంగేజ్ మెంట్

ఆర్.ఆర్.ఆర్. సంగీత శక్తిని మరోసారి లండన్‌లో ప్రదర్శించనున్న కీరవాణి

కమల్ హాసన్, శివకార్తికేయన్ అమరన్ టీంని ప్రశంసించిన రజనీకాంత్

మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది.. నటి సుహాసిని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments