Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించలేం : సుప్పీంకోర్టు

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (14:02 IST)
స్వలింగ వివాహాల(గే వివాహాలు)కు చట్టబద్ధత కల్పించలేమని, దీనిపై తుది నిర్ణయం తీసుకునే తుదినిర్ణయం పార్లమెంట్‌దేనని సుప్రీంకోర్టు కీలక వ్యాఖఅయలు వ్యాఖ్యలు చేసింది. సేమ్ సెక్స్ మ్యారేజ్‌లకు గుర్తింపు, చట్టబద్ధత కల్పించే అధికారం పార్లమెంట్ దేనని స్పష్టతనిచ్చింది. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇందుకోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 
 
ఈ మేరకు స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఇలాంటి వివాహాలు చేసుకున్న జంటలకు రేషన్ కార్డులు, పెన్షన్, గ్రాట్యుటీలతో పాటు వారసత్వ హక్కులు కల్పించే విషయాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. 
 
ఈ విషయంలో ఎదురయ్యే ఇతరత్రా సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలను గుర్తించేందుకు కేబినెట్ సెక్రెటరీ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అదేసమయంలో స్వలింగ వివాహాలకు సమాన హోదా కట్టబెట్టేందుకు మాత్రం కోర్టు నిరాకరించింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మంగళవారం ఈ తీర్పు వెలువరించింది. 
 
కాగా, పిల్లలను దత్తత తీసుకునేందుకు స్వలింగ జంటలకు అవకాశం కల్పించాలని ఐదుగురు న్యాయమూర్తుల్లో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌తో పాటు జస్టిస్ ఎస్‌ కే కౌల్ అభిప్రాయపడ్డారు. అయితే, బెంచ్‌లోని మిగతా ముగ్గురు జడ్జిలు.. జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ హిమా కోహ్లి దీనిని వ్యతిరేకించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం