వైద్య పరీక్షలు పూర్తి.. మెడికల్ కేర్‌లో ఉన్న రఘురామరాజు

Webdunia
బుధవారం, 19 మే 2021 (07:49 IST)
ఏపీలోని అధికార వైకాపాకు చెందిన నర్సాపురం రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ఈ మేరకు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. 
 
తెలంగాణ హైకోర్టు నియమించిన జ్యుడీషియల్ అధికారి ఆధ్వర్యంలో ముగ్గురు వైద్యుల బృందం పరీక్షలను నిర్వహించిందని చెప్పారు. ఈ పరీక్షల ప్రక్రియను వీడియో తీశామని తెలిపారు. ప్రస్తుతం రఘురాజు ఆసుపత్రిలో మెడికల్ కేర్‌లో ఉన్నారని చెప్పారు.
 
అయితే, సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలను ఇచ్చేంత వరకు ఆయన ఇక్కడే ఉంటారని వెల్లడించారు. కరోనా ప్రొటోకాల్‌ను కూడా పాటిస్తున్నామని చెప్పారు. మరోవైపు డాక్టర్లు ఇచ్చే రిపోర్టును సుప్రీంకోర్టుకు తెలంగాణ హైకోర్టు సీల్డ్ కవర్‌లో సమర్పించనుంది. 
 
రఘురాజు ఆసుపత్రిలో ఉన్న సమయాన్ని కూడా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్టుగానే పరిగణించనున్నారు. ఇంకోవైపు, ఆయనను చూసేందుకు ఆర్మీ అధికారులు ఎవరినీ అనుమతించడం లేదు. అయితే, రఘురామరాజు కుడికాలు బాగా వాచిపోయివున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments