Webdunia - Bharat's app for daily news and videos

Install App

25 మంత్రులు వీరే... అందుకేనా భూమన భగభగ... రోజా మౌనం

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (21:00 IST)
ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం పూర్తి వివరాలు వచ్చేశాయి. రేపు ప్రమాణం చేయబోయేవారి వివరాలు వెల్లడయ్యాయి. ఐతే ఈ జాబితాలో ఖచ్చితంగా పేర్లు వుంటాయని అనుకున్న భూమన కరుణాకర్ రెడ్డి, ఆర్కే రోజా పేర్లు లేవు. దీనితో ఒకింత ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి కూర్పు చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. బహుశా... అందుకేనేమో... నిన్న భూమన కరుణాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఇక పోటీ చేయబోను అని చెప్పేశారు. అలాగే రోజా కూడా మౌనం దాల్చారు. మరి వీరికి జగన్ చెప్పినట్లు నెక్ట్స్ బంచ్‌లో... అంటే మరో రెండున్నరేళ్ల తర్వాత ఇస్తారేమో చూడాలి.
 
ఇకపోతే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన కేబినెట్‌లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించారు. బీసీలకు పెద్దపీట వేశారు. ఎనిమిది మంది బీసీలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. రెడ్డి, కాపు సామాజిక వర్గానికి నాలుగేసి కేబినెట్‌ బెర్త్‌లు కేటాయించారు. ఎస్సీలకు 5 మంత్రి పదవులు కేటాయించారు. క్షత్రియ, కమ్మ, వైశ్య, మైనారిటీ సామాజిక వర్గాలకు ఒక్కో బెర్త్‌ దక్కింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేను శాసనసభ ఉపసభాపతిగా నియమించనున్నారు.
 
 
కేబినెట్‌లో చోటు దక్కించుకున్న 25 మంది వీరే..
 
1. ధర్మాన కృష్ణదాస్‌ (నర్సన్నపేట)
 
2. బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి)

3. పాముల పుష్పశ్రీవాణి (కురుపాం)
 
4. అవంతి శ్రీనివాస్‌ (భీమిలి)
 
5. కురసాల శ్రీనివాస్‌(కాకినాడ రూల్‌)
 
6. పినిపే విశ్వరూప్‌ (అమలాపురం)
 
7. పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ (ఎమ్మెల్సీ)
 
8. తానేటి వనిత (కొవ్వూరు)
 
9. ఆళ్ల నాని (ఏలూరు)
 
10. చెరుకువాడ శ్రీరంగరాజు(ఆచంట)
 
11. కొడాలి నాని (గుడివాడ)
 
12. వెల్లంపల్లి శ్రీనివాస్‌ (విజయవాడ పశ్చిమ)
 
13. పేర్ని నాని (మచిలీపట్నం)
 
14. ఆళ్ల రామకృష్ణారెడ్డి(మంగళగిరి)

15. మేకతోటి సుచరిత (ప్రత్తిపాడు)
 
16. మోపిదేవి వెంకటరమణ
 
17. బాలినేని శ్రీనివాస్‌(ఒంగోలు)
 
18. మేకపాటి గౌతమ్‌రెడ్డి (ఆత్మకూరు)
 
19. అనిల్ కుమార్ యాదవ్ (నెల్లూరు)

20. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు)
 
21. నారాయణస్వామి (గంగాధర నెల్లూరు)

22. అంజద్ బాషా (కడప)

23. శంకర్ నారాయణ (పెనుగొండ)

24. బుగ్గన రాజేంద్రనాథ్(డోన్)

25. గుమ్మనూరు జయరాం(ఆలూరు)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments