Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంత్రివర్గంలో బీసీలు - ఎస్సీలకే పెద్దపీట.. 'కమ్మ'కు మొండిచేయి?... కొత్త మంత్రులు వీరే...

మంత్రివర్గంలో బీసీలు - ఎస్సీలకే పెద్దపీట.. 'కమ్మ'కు మొండిచేయి?... కొత్త మంత్రులు వీరే...
, శుక్రవారం, 7 జూన్ 2019 (18:33 IST)
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని శనివారం విస్తరించనున్నారు. ఇందుకోసం ఆయన చేపట్టిన మంత్రివర్గం కూర్పు పూర్తయింది. ఈ మంత్రివర్గంలో బీసీ డిక్లరేషన్‌ మేరకు ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి పెద్దపీట వేశారు. ముస్లిం వర్గానికి చెందిన ఓ మహిళతో సహా 8 మంది బీసీలకు మంత్రివర్గంలో చోటుకల్పించారు. అలాగే ఐదుగురు ఎస్సీ ఎమ్మెల్యేలకు స్థానం కల్పించారు. 
 
అలాగే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో కీలక పాత్ర పోషించిన కమ్మ సామాజికి వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కానీ, జగన్ మాత్రం తన మంత్రివర్గంలో కేవలం ఒకే ఒక్క కమ్మ ఎమ్మెల్యేకు చోటు కల్పించారు. అలాగే, ఎస్టీ, క్షత్రియ, వైశ్య సామాజిక వర్గాలకు చెందిన వారిలో ఒక్కొక్కరిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. వీరితో పాటు.. నలుగురు రెడ్డిలు, నలుగురు కాపు ఎమ్మెల్యేలకు కూడా అవకాశం కల్పించారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు ఉప సభాపతిగా నియమించనున్నారు.
 
శుక్రవారం సాయంత్రం 6.20 గంటల వరకు ఫోన్లు వెళ్లిన మంత్రుల పేర్ల వివరాలను పరిశీలిస్తే, ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట), పుష్పశ్రీవాణి (కురుపాం), కురసా కన్నబాబు (కాకినాడ రూరల్), అవంతి శ్రీనివాస్ (భీమిలి), బోత్స సత్యనారాయణ (చీపురుపల్లి), పిల్లి సుభాష్ చంద్రబోస్ (ఎమ్మెల్సీ), పినెసె విశ్వరూప్ (అమలాపురం), ఆళ్ళ నాని (ఏలూరు),  బాలినేని శ్రీనివాస్ రెడ్డి (ఒంగోలు), తానేటి వనిత (కొవ్వూరు)లు ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పేరుకే కానిస్టేబుల్‌.. ఎప్పుడుపడితే అప్పుడు.. లాడ్జిలో మహిళలతో ఉల్లాసం..