Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇప్పటివరకు వచ్చిన జాబితా... 19 మంది ఏపీ మంత్రులు వీరే..

Advertiesment
AP Ministers list
, శుక్రవారం, 7 జూన్ 2019 (19:30 IST)
ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ కూర్పు పూర్తయింది. మంత్రుల జాబితాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం స్వయంగా గవర్నర్‌ నరసింహన్‌కు అందజేశారు. కేబినెట్‌లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించారు. బీసీలకు పెద్దపీట వేశారు. ఎనిమిది మంది బీసీలకు మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. 
 
రెడ్డి, కాపు సామాజిక వర్గానికి నాలుగేసి కేబినెట్‌ బెర్త్‌లు కేటాయించారు. ఎస్సీలకు 5 మంత్రి పదవులు కేటాయించారు. క్షత్రియ, కమ్మ, వైశ్య, మైనారిటీ సామాజిక వర్గాలకు ఒక్కో బెర్త్‌ దక్కింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేను శాసనసభ ఉపసభాపతిగా నియమించనున్నారు. మంత్రులుగా అవకాశం దక్కినవారికి ఫోన్లు చేస్తున్నారు.
 
కేబినెట్‌లో చోటు దక్కించుకున్నవారు..
 
1. ధర్మాన కృష్ణదాస్‌ (నర్సన్నపేట)
 
2. బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి)
 
3. అవంతి శ్రీనివాస్‌ (భీమిలి)
 
4. పాముల పుష్పశ్రీవాణి (కురుపాం)
 
5. కురసాల శ్రీనివాస్‌(కాకినాడ రూల్‌)
 
6. పినిపే విశ్వరూప్‌ (అమలాపురం)
 
7. పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ (ఎమ్మెల్సీ)
 
8. బాలినేని శ్రీనివాస్‌(ఒంగోలు)
 
9. కొనాలి నాని (గుడివాడ)
 
10. పేర్ని నాని (మచిలీపట్నం)
 
11. తానేటి వనిత (కొవ్వూరు)
 
12. చెరుకువాడ శ్రీరంగరాజు(ఆచంట)
 
13. ఆళ్ల నాని (ఏలూరు)
 
14. మేకపాటి గౌతమ్‌రెడ్డి (ఆత్మకూరు)
 
15. వెల్లంపల్లి శ్రీనివాస్‌ (విజయవాడ పశ్చిమ)
 
16. మేకతోటి సుచరిత (ప్రత్తిపాడు)
 
17. మోపిదేవి వెంకటరమణ
 
18. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు)
 
19. ఆళ్ల రామకృష్ణారెడ్డి(మంగళగిరి)

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్‌లో హద్దు మీరిన భార్య.. ఉరేసుకున్న భర్త.. కుమారుడికి విషమిచ్చి?