ఆర్టీసీ బస్సు స్టీరింగ్ పట్టిన ఏపీ మంత్రి సవిత

ఠాగూర్
మంగళవారం, 29 అక్టోబరు 2024 (12:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆర్టీసీ బస్సు నడిపిన ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో అటు ఆర్టీసీ అధికారులతో పాటు పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేశాయి. సత్యసాయి జిల్లా పెనుకొండ ఆర్టీసీ డిపోకు నూతనంగా రెండు బస్సులు మంజూరు అయ్యాయి, ఈ నేపథ్యంలో సోమవారం పెనుకొండ బస్టాండ్‌‍లో నూతనంగా మంజూరైన రెండు ఆర్టీసీ బస్సులను మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా ఓ బస్సు ట్రైల్ రన్ చేశారు. మంత్రి సవిత స్టీరింగ్ పట్టుకుని బస్సు నడపడంతో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, పార్టీ శ్రేణులు ఆశ్చర్యానికి గురయ్యారు. 
 
అనంతరం మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వం పదివేల కోట్లు అప్పు చేసినా మౌలిక వసతుల కల్పనకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. కొత్త బస్సులను గత ప్రభుత్వంలో కొనుగోలు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 400 బస్సులు కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం మధుసూధన్, సిబ్బంది, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran: ఇకపై మీరు గర్వపడేలా మూవీస్ చేస్తాను : కిరణ్ అబ్బవరం

Telusu kadaa Review: అమ్మాయిల ప్రేమలో నిజమెంత. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రివ్యూ

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments