ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్‌ను నటుడు, డైరెక్టర్ రాధాకృష్ణన్ పార్థిబన్ ఆదివారం కలిశారు. ఆదివారం సాయంత్రం మంగళగిరిలోని డిప్యూటీ సీఎం కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌తో పార్థిబన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా పార్థిబన్‌ను పవన్ కళ్యాణ్ సత్కరించారు. జ్ఞాపికలు బహూకరించారు. పార్థిబన్ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జ్ఞాపిక అందించారు. అలాగే ఓ పుస్తకాన్ని కూడా బహూకరించారు.
నటుడుతో పాటుగా డైరెక్టర్ కూడా అయిన పార్థిబన్ 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. టాలీవుడ్ ప్రముఖులతో ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్‌ను ఎందుకు కలిశారా అనేది ఆసక్తికరంగా మారింది.