Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా మంత్రి రోజా అవ్వలో మాటలు తప్ప.... మ్యాటర్ లేదు : జనసేన నేత కిరణ్ రాయల్

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (10:42 IST)
ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజాలో మాటలు తప్ప మ్యాటర్ లేదని తిరుపతి జిల్లా జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయంపై ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ మంత్రి రోజాపై తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. 
 
'ఏ ఆడపిల్లకైనా కష్టమొస్తే గన్ కంటే ముందు జగన్ వచ్చి శిక్షిస్తాడనే నమ్మకం కావాలి అధ్యక్షా' అంటూ అసెంబ్లీలో ఆమె మాట్లాడిన ఆడియోను ఆయన ప్లే చేశారు. ఇప్పుడు గన్నూ లేదు, జగనూ లేడని కిరణ్ ఎద్దేవా చేశారు. రోజా అవ్వకి మాటలు తప్ప మ్యాటర్ లేదని ఎద్దేవా చేస్తూ, పోస్టర్ ను చూపించారు. 
 
ఆడపిల్లకు కష్టమొస్తే గన్ కంటే ముందు జగన్ వస్తాడని రోజా అవ్వ చెప్పిందని... భవ్యశ్రీ చనిపోయి ఇప్పటికి పది రోజులు అవుతోందని, గన్ రాలేదు, జగన్ రాలేదు, కనీసం నీవు కూడా రాలేదని విమర్శించారు.
 
ఒక మహిళా మంత్రి అయ్యుండి, కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు కూడా రాలేదని మండిపడ్డారు. అదే వైసీపీకి చెందిన ఎవరి కుటుంబంలోనైనా ఇలా జరిగి ఉంటే మా అవ్వ ఎంతో ఓవరాక్షన్ చేసేదని, ఇంత పెద్ద నోరు వేసుకుని పడిపోయేదని అన్నారు. 
 
నగరి నియోజకవర్గానికి 30 కిలోమీటర్ల దూరంలో దారుణం జరిగితే ఇంతవరకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మహిళలన్నా, బీసీలన్నా చిన్న చూపా? అని నిలదీశారు. భవ్యశ్రీ మృతి పట్ల నిజనిజాలను నిగ్గు తేల్చాలని, ఆమె మృతికి కారకులైన వారి వివరాలను బయటపెట్టి శిక్షించాలని వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments