విజయనగరం జిల్లా.. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళితే.. మృతులు బాలరాజు, జయరాజు, మర్రి శివలు స్కూటీలో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగి వుండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
వంద అడుగుల లోయలో స్కూటీ పడి పోవడంతో తీవ్రగాయాలకు గురైన ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు యువకులు మృతి చెందారు.
మృతులు మక్కువ మండలం అనసభద్ర గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.