Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దళిత బాలికపై నలుగురు బాలుర ఘాతుకం.. బెదిరించి యేడాదిగా అత్యాచారం..

Advertiesment
victimboy
, బుధవారం, 27 సెప్టెంబరు 2023 (14:22 IST)
ఏపీలోని విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో నలుగురు యువకులు ఘాతుక చర్యకు పాల్పడ్డారు. దళిత బాలికపై నలుగురు యువకులు గత యేడాది కాలంగా బెదిరిస్తూ అత్యాచారం చేస్తున్నాడు. వారి బెదిరింపులకు లొంగిపోయి మానసికవేదన అనుభవిస్తున్న కుమార్తె ప్రవర్తను అమ్మమ్మ పసిగట్టి... నిలదీయడంతో అసలు విషయాన్ని వెల్లడించింది. దీంపో ఆండ్ర పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
మెంటాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఒక విద్యార్థిని స్థానికంగా ఉండే నలుగురు బాలురు గత కొంతకాలంగా బెదిరించి లొంగదీసుకుని అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ తంతు గత యేడాదిగా సాగుతుంది. ఆ బాలిక తల్లిదండ్రులు మనస్పర్థల కారణంగా వేర్వేరుగా ఉండటంతో బాలిక మాత్రం అమ్మమ్మ సంరక్షణలో ఉండేది. 
 
అయితే, గత కొద్ది రోజులుగా బాలిక ప్రవర్తనలో మార్పు కనిపించడాన్ని అమ్మమ్మ గుర్తించింది. పైగా బాలిక ముభావంగా ఉండటం, ఇదివరకటిలా తనతో మాట్లాడకపోవడంతో అనుమానం వచ్చి ప్రశ్నించింది. దీంతో భోరున విలపిస్తూ బాలిక విషయం చెప్పింది. వెంటనే అమ్మమ్మ కులపెద్దలు, గ్రామపెద్దల దృష్టికి తీసుకు వెళ్లగా వారు ఆ నలుగురు యువకుల తల్లిదండ్రులను పిలిచి హెచ్చరించారు. 
 
ఆ సమయంలో యువకుల బంధువులు గొడవకు దిగారు. ఈ పరిణామంపై పెద్దల సూచనతో బాధితురాలు రెండ్రోజుల క్రితం ఆండ్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై బొబ్బిలి డీఎస్పీ శ్రీధర్‌ మంగళవారం దర్యాప్తు చేపట్టారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు ఉండగా ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త ... ఏంటది?