విశాఖపట్టణంలోని జూలో ఉన్న ఆడసింహం మహేశ్వరికి గుండెపోటు వచ్చింది. దీంతో అది మృత్యువాతపడింది. మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్‌తో మహేశ్వరి మృతి చెందినట్టు జూ అధికారులు తెలిపారు. గత 2006లో గుజరాత్‌లో జన్మించి దీనిని 2019లో వైజాగ్ జూకు తరలించారు. సింహాల జీవితకాలం గరిష్టంగా 18 యేళ్లే అయినప్పటికీ 19వ యేట మరణించడం గమనార్హం.
విశాఖపట్టణంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్కులో ఉన్న మహేశ్వరికి శనివారం రాత్రి గుండెపోటు వచ్చిందని జూ అధికారులు తెలిపారు. వయసు మీదపడటంతో మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్‌తో అది మరణించినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలిందని తెలిపారు.
గత 2006లో జన్మించిన మహేశ్వరి 2019లో గుజరాత్ రాష్ట్రంలోని సక్కర్ బాగ్ జూ నుంచి వైజాగ్ జూకు తరలించారు ఇది లక్షలాది మంది ఆసియాటిక్ సింహాలపై అవగాహన అందించడంతో పాటు సింహాల పరిరక్షణకు తోడ్పడినట్టు జూ అధికారులు తెలిపారు. సాధారణంగా సింహాల వయసు 16 నుంచి 18 యేళ్లు మాత్రమే జీవిస్తాయని కానీ మహేశ్వరి మాత్రం 19వ యేటలోకి అడుగుపెట్టిందని వారు తెలిపారు.