Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త ... ఏంటది?

hyderabad metro
, బుధవారం, 27 సెప్టెంబరు 2023 (13:00 IST)
హైదరాబాద్ నగర వాసులకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులు శుభవార్త చెప్పారు. అత్యంత శోభాయమానంగా జరిగే గణేష్ నిమజ్జనం గురువారం జరుగనుంది. దీన్ని పురస్కరించుకుని భక్తులు రాకపోకలు సాగించేందుకు వీలుగా తెల్లవారుజామున 2 గంటల వరకు మెట్రో రైల్ సర్వీసులు నడుపుతామని పేర్కొంది. మెట్రో రైళ్లతో పాటు ఆర్టీసీ సైతం హుస్సేన్ సాగర్ నలుమూలల నుంచి 535 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్టు తెలిపింది. 
 
అయితే, గణేష్ నిమజ్జనం - మిలాద్ ఉన్ నబీ వేడుకలు 35 యేళ్ల తర్వాత ఒకేసారి రావడంతో 125 ప్లాటూన్ల అదనపు బలగాలు, ఆర్ఏఎఫ్ బలగాలు, పారామిలిటరీ బలగాలు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నగర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నారు. 

మనిషి పుట్టుక పుట్టిన ఎవడైనా అలా మాట్లాడుతాడా? అయ్యన్నపాత్రుడు 
 
మనిషి పుట్టుక పుట్టిన ఎవడైనా మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడినట్టుగా మాట్లాడుతారా అని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కొడాలి నానికి చంద్రబాబును, నారా లోకేశ్‌ను భువనేశ్వరి, వారి కుటుంబ సభ్యులను విమర్శించడం మినహా ఇంకేం పని ఉందన్నారు. ఆయన మంత్రిగా పని చేసిన సమయంలో ఏనాడైనా తన శాఖ గురించి మాట్లాడారా అని ఆయన ప్రశ్నించారు. 
 
ప్రజలకు పనికొచ్చే పని చేశావా? అధికారాన్ని ఉపయోగించుకొని పేకాడ క్లబ్బులు వంటి వాటితో డబ్బులు సంపాదించుకోవడం తప్ప, నీ శాఖపరంగా మంచి చేశావని చెప్పగలవా? అని నిలదీశారు. మనిషిగా పుట్టినవారు ఎవరైనా అలా మాట్లాడతారా? సంస్కారం ఉన్నవాళ్లు అలా మాట్లాడతారా? ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తులు ఇలా దిగజారి మాట్లాడుతారా? అని నిలదీశారు. 
 
ఈరోజు చంద్రబాబు గురించి ఎన్నో దేశాలవారు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు ఏపీ కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డారని, నీలాంటి సన్నాసులకు అది కనిపించదని కొడాలి నానిని ఉద్దేశించి అన్నారు. మా పార్టీ అధినేతపై మీరు చేస్తున్న కుట్రలకు ఆయనకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందన్నారు. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి మీ నాయకుడు జగన్ అయితే, ఏ తప్పు చేయకుండా రాత్రింబవళ్లు కష్టపడ్డ వ్యక్తి చంద్రబాబు అన్నారు.
 
ఓ వ్యక్తిపై ఇష్టం లేకుంటే జైల్లో వేస్తారా? అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారన్నారు. మీ నాయకుడు దొంగ... ముఖ్యమంత్రి అంటూ కొడాలి నానిని ఉద్దేశించి అన్నారు. జగన్ ఇపుడు పాదయాత్ర చేయగలడా? అన్నారు. ఈ రోజు ఆయన పాదయాత్ర చేస్తే అందరూ అడ్డుకుంటున్నారని, అది జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పాలన తీరు అని వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలినేని శ్రీనివాస రెడ్డికి షాకిచ్చిన వైకాపా... అనుచరుల సస్పెండ్