Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల నివార‌ణ‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు: మంత్రి గంటా

అమ‌రావ‌తి : ఇటీవ‌ల త‌ర‌చుగా జ‌రుగుతున్న విద్యార్థుల ఆత్మ‌హ‌త్యలను ఎలా నివారించాల‌న్న అంశంపై రాష్ట్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఉన్న‌తాధికారుల‌తో మంగ‌ళ‌వారం సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఇంట‌ర్మీడియట్ క‌మీష‌న‌ర్ బి. ఉద‌య‌ల‌క్ష్మీ

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2017 (20:56 IST)
అమ‌రావ‌తి : ఇటీవ‌ల త‌ర‌చుగా జ‌రుగుతున్న విద్యార్థుల ఆత్మ‌హ‌త్యలను ఎలా నివారించాల‌న్న అంశంపై రాష్ట్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఉన్న‌తాధికారుల‌తో మంగ‌ళ‌వారం సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఇంట‌ర్మీడియట్ క‌మీష‌న‌ర్ బి. ఉద‌య‌ల‌క్ష్మీతోపాటు ఉన్న‌తాధికారుల‌తో మంగ‌ళ‌వారం ఉద‌యం ఆయ‌న స‌మావేశ‌మయ్యారు. త‌ర‌చూ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల ఘ‌ట‌న‌లు జ‌రుగుతుండ‌టం చాలా బాధిస్తోంద‌ని, దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాల‌న్నారు. 
 
విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల అంశంపై గ‌తంలో ఇచ్చిన చ‌క్ర‌పాణి క‌మిటీ సిఫార్సుల అమ‌లుపైనా చ‌ర్చించారు. వీటికి సంబంధించి కొన్ని గైడ్‌లైన్స్ కూడా ఇచ్చిన‌ప్ప‌టికీ క‌ళాశాల‌ల యాజ‌మాన్యాలు అవి స‌రిగా పాటించ‌డం లేదన్న విష‌యాన్ని మంత్రి దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. క‌ళాశాల‌ల యాజ‌మాన్యాల‌తో ఈ నెల 16న స‌మావేశం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. స్ప‌ష్ట‌మైన ఆదేశాల‌ను క‌ళాశాల‌ల‌కు ఈ స‌మావేశంలో మంత్రి గంటా ఇవ్వ‌నున్నారు. 
 
ఒత్తిడి లేని విద్య‌ను అందించ‌డం, ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఏర్పాటు, మాన‌సిక‌ హెల్త్ చెక‌ప్‌లు, కౌన్సిలింగ్ త‌దిత‌ర అంశాలు క‌ళాశాలు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని చ‌క్ర‌పాణి క‌మిటీ సిఫార్సుల చేసింది. విద్యార్థుల ప్ర‌తిభ ఆధారంగా త‌ర‌చూ త‌ర‌గ‌తులు మార్చ‌డం, విద్యార్థుల మార్కులు నోటీసు బోర్డులో వుంచ‌డం వంటి అంశాలు విద్యార్థులు న్యూన‌త భావానికి లోనయ్యేలా చేస్తున్నాయ‌ని క‌మిటీ తెలిపింది. వీటికి అడ్డుక‌ట్ట వేసేలా గ్రేడింగ్ ప‌ద్ధ‌తిని ప్ర‌వేశ పెట్టే అంశంపైనా మంత్రి గంటా చ‌ర్చించారు. 
 
ఏదిఏమైన‌ప్ప‌టికీ... విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల నివార‌ణ‌కు ప‌టిష్ట చర్య‌లు చేప‌ట్టాల‌ని ఆ దిశ‌గా అధికారులు స‌న్న‌ద్ధం కావాల‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. చ‌క్ర‌పాణి క‌మిటీ సిఫార్సుల‌ అంశాన్ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దృష్టికి కూడా తీసుకెళ్తున్న‌ట్లు మంత్రి గంటా శ్రీనివాస‌రావు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments