నాలో లోపాలు ఉన్నాయ్.. మనస్తత్వ విశ్లేషకుడి వద్దకు వెళ్తా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేష్. ఈయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా. ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకైక తనయుడు. కొంతకాలం పార్టీ శ్రేణుల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేష్. ఈయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా. ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకైక తనయుడు. కొంతకాలం పార్టీ శ్రేణులతో కలిసి పనిచేశాక.. క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ టిక్కెట్ ద్వారా శాసనమండలిలోకి అడుగుపెట్టి రాష్ట్రమంత్రి అయ్యారు.
అయితే, నారా లోకేష్‌కు ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం లేదనే విమర్శలు జోరుగా వచ్చాయి. దీనికి పలు సందర్భాల్లో ఆయన మాటతీరుకు కూడా తోడైంది. దీంతో విపక్షాలు లోకేష్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించాయి. పిమ్మట తండ్రి సూచన మేరకు గత కొంతకాలంగా నారా లోకేష్ మంత్రిగా ఉన్నప్పటికీ పెద్దగా హంగూఆర్భాటాలు ఎక్కడా కనిపించడం లేదు.
ఈనేపథ్యంలో తాజాగా అమరావతి కేంద్రంగా టీడీపీ వర్క్‌షాప్ జరిగింది. ఇందులోభాగంగా, వ్యక్తిత్వ విశ్లేషణ పరీక్షను కూడా నిర్వహించింది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, ప్రతి మనిషిలోనూ లోపాలు ఉంటాయని, అలాగే, తనలోనూ కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పారు. ఆ లోపాలను సవరించుకోగలిగినంత వరకు సవరించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఈ పరీక్షలో పాల్గొని విశ్లేషణ తీసుకున్నానని అన్నారు. ఈ పరీక్ష ద్వారా తనలోని కొన్ని లోపాలు తెలిశాయని, వాటిని సవరించుకునేందుకు మనస్తత్వ విశ్లేషకుడి వద్దకు శిక్షణకు వెళ్తున్నానని తెలిపారు.